దెబ్బకు కోహ్లీ రికార్డ్ గల్లంతు తిలక్ కు సూర్యా భాయ్ సలాం
ఇంగ్లాండ్ పై టీ ట్వంటీ సిరీస్ లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ ఇంగ్లీష్ టీమ్ ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గట్టిపోటీనే ఇచ్చింది. కానీ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ మెరుపులకు ఇంగ్లాండ్ ఓటమి రుచిచూడక తప్పలేదు.
ఇంగ్లాండ్ పై టీ ట్వంటీ సిరీస్ లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ ఇంగ్లీష్ టీమ్ ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గట్టిపోటీనే ఇచ్చింది. కానీ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ మెరుపులకు ఇంగ్లాండ్ ఓటమి రుచిచూడక తప్పలేదు. చివరి వరకూ క్రీజులో నిలిచిన తిలక్ వర్మ 55 బంతుల్లోనే 72 రన్స్ తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో రెండు ఔట్‌లు మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ సూపర్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ సూపర్ రికార్డు న్యూజిలాండ్స్టార్ ప్లేయర్ మార్క్ చాప్‌మన్ అందుకున్నాడు. అతడు టీ20ల్లో రెండు డిస్మిసల్స్ మధ్య 271 పరుగులు సాధించాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌లో చాప్‌మన్ రికార్డును ఈ హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచాడు.
టీ20ల్లో రెండు ఔట్‌లు మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా తరఫున కోహ్లీ , సంజూ శాంసన్ , రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ ఉన్నారు. ఇదిలా ఉంటే హాఫ్ సెంచరీ చేసినా తిలక్ వర్మ సెలబ్రేట్ చేసుకోలేదు. మ్యాచ్ గెలిపించడమే లక్ష్యంగా చివరి వరకూ పట్టుదలగా ఆడాడు. వికెట్లు పడుతున్నప్పటికి తిలక్ మాత్రం టెయిలాండర్లతో కలిసి తన సూపర్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. ఆఖరివరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ముగించాడు.అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు. ఇక హైదరాబాదీ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిధా అయ్యాడు. విజయనంతరం గ్రౌండ్‌లోకి వచ్చిన సూర్య.. తిలక్ వద్దకు వెళ్లి సలాం కొట్టి మరీ చప్పట్లతో అభినందించాడు. అందుకు తిలక్ కూడా గౌరవంగా తలవంచి రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.
తిలకి వీరోచిత పోరాటంతో 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో అందుకుంది. తద్వారా చెపాక్ టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ ట్వంటీ మంగళవారం రాజ్ కోట్ లో జరగనుంది.