భారత్ పతకాల వేట షురూ పారాలింపిక్స్‌లో అవనికి గోల్డ్
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేటను ఘనంగా ఆరంభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖర చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని రికార్డులకెక్కింది.
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేటను ఘనంగా ఆరంభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖర చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని రికార్డులకెక్కింది. టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో పసిడి గెలిచిన అవని.. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో కాంస్యం నెగ్గింది. తాజాగా పారిస్ లో స్వర్ణం సాధించింది. దీంతో పారాలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత అథ్లెట్ గా రికార్డు అందుకుంది. ఇక ఇదే విభాగంలో మోనా అగర్వాల్ కూడా సత్తా చాటింది. ఆమె కాంస్య పతకాన్ని సాధించింది.