Virat Kohli : ఇలాంటి జీవితం అస్సలు ఊహించలేదు..అతడే దేవుడు నేను సైనికుణ్ణి
కెరీర్ ప్రారంభించినప్పుడు ఇన్ని సెంచరీలు, పరుగులు చేస్తానని అనుకోలేదని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చెప్పాడు. ప్రపంచ కప్ లో ఆరు మ్యాచుల్లో ఒక శతకం, మూడు అర్ధ సెంచరీలతో కోహ్లి సత్తాచాటాడు. మరో సెంచరీ సాధిస్తే వన్డేల్లో అత్యధికంగా 49 శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తాడు. "సుదీర్ఘ కెరీర్, ప్రదర్శనలతో దేవుడు ఆశీర్వదిస్తాడని.. ఇన్ని సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు కానీ, బాగా ఆడాలని ఎప్పుడూ కలలు కన్నాను.

Indias star batsman Virat Kohli said that when he started his career he did not think that he would score so many centuries and runs
కెరీర్ ప్రారంభించినప్పుడు ఇన్ని సెంచరీలు, పరుగులు చేస్తానని అనుకోలేదని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చెప్పాడు. ప్రపంచ కప్ లో ఆరు మ్యాచుల్లో ఒక శతకం, మూడు అర్ధ సెంచరీలతో కోహ్లి సత్తాచాటాడు. మరో సెంచరీ సాధిస్తే వన్డేల్లో అత్యధికంగా 49 శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును దాటేస్తాడు. “సుదీర్ఘ కెరీర్, ప్రదర్శనలతో దేవుడు ఆశీర్వదిస్తాడని.. ఇన్ని సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు కానీ, బాగా ఆడాలని ఎప్పుడూ కలలు కన్నాను. కానీ సరిగ్గా ఇలాగే జరుగుతుందని ఊహించలేదు అని కింగ్ కోహ్లీ అన్నాడు. కెరీర్ సాగుతున్న తీరు, మన ముందు జరిగే విషయాలు, ముందస్తు ప్రణాళికతో 12 ఏళ్లలో ఇన్ని సెంచరీలు, పరుగులు సాధిస్తానని అనుకోలేదు. జట్టు కోసం బాగా రాణించాలని.. క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు అందించాలని మాత్రమే భావించా. అందుకోసం క్రమశిక్షణ, జీవనశైలికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకున్నా” అని కోహ్లి తెలిపాడు. నవంబర్ 5 వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న కోహ్లీ, అదే రోజున సౌతాఫ్రికా వేదికగా, కలకత్తాలో 50 సెంచురీల రికార్డును అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు.