David Warner : స్టార్ ప్లేయర్ కు గాయం.. టెన్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కొందరు ఆటగాళ్లు గాయపడడం ఇప్పుడు ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పటిష్టమైన జట్టును రంగంలోకి దించాలని పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు.

Injury to star player.. Delhi Capitals in tension
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కొందరు ఆటగాళ్లు గాయపడడం ఇప్పుడు ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పటిష్టమైన జట్టును రంగంలోకి దించాలని పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. డేవిడ్ వార్నర్ న్యూజిలాండ్‌తో జరిగిన టీ ట్వంటీ సిరీస్‌లో గాయపడ్డాడు. వార్నర్ టోర్నీ (Warner tourney) కి ముందు కోలుకోగలడా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత సీజన్‌లో రిషబ్ పంత్ గైర్హాజరీలో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా వ్యవహరించాడు. వార్నర్ అందుబాటులో లేకుంటే రిషబ్ పంత్ జట్టుకు భారీ షాక్ అనే చెప్పుకోవాలి.
మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైన ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ జే రిచర్డ్‌సన్ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు. రిచర్డ్‌సన్ సైడ్ స్ట్రెయిన్ సమస్యతో బాధపడుతున్నాడని, ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో ఆడడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ తెలిపాడు.ఈసారి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ తిరిగి పోటీ క్రికెట్‌లోకి రానున్నాడు.