తిలక్ వర్మకు అవమానం, ముంబై జట్టుపై ఫ్యాన్స్ ఫైర్

ఐపీఎల్ 2025 లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ కలకలం రేపుతోంది. ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అయిన తిలక్ ను ఇలా అవమానిస్తారా అని ముంబయి ఇండియన్స్ ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2025 | 05:45 PMLast Updated on: Apr 05, 2025 | 5:45 PM

Insult To Tilak Verma Fans Fire On Mumbai Team

ఐపీఎల్ 2025 లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ కలకలం రేపుతోంది. ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అయిన తిలక్ ను ఇలా అవమానిస్తారా అని ముంబయి ఇండియన్స్ ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ముంబై బ్యాటింగ్ ఆఖరి ఓవర్‌కి ముందు హార్దిక్ తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. తిలక్ వర్మ సడెన్‌గా గ్రౌండ్ వీడి వెళ్లిపోవడంతో స్టేడియంలో ఉన్న వాళ్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి.భారీ టార్గెట్‌తో బరిలోలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మూడో స్థానంలో రావాల్సిన తిలక్ వర్మను ముంబై ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించింది.

సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తిలక్ వర్మ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. స్కై భారీ షాట్లతో వేగంగా ఇన్నింగ్స్ ఆడుతుంటే, తిలక్ వర్మ సూర్యకి స్ట్రయికింగ్ ఇస్తూ నెమ్మదిగా ఆడుతున్నాడు. అయితే, 17వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత కూడా తిలక్ నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో నుంచి తిలక్ వర్మ ఇన్నింగ్స్‌కు చికాకు పడిన హార్దిక్ పాండ్యా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్‌గా పంపించి క్రీజులోని శాన్‌ట్నర్‌ని పిలిచాడు. ఏడు బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ వర్మను బయటకు పంపించడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ ఉండుంటే ఆఖరి బంతికి బౌండరీ బాదేవాడేమో.. సిక్సర్లు కొట్టేవాడేమో కదా అని టీమిండియా మాజీలు అంటున్నారు. తిలక్ స్థానంలో వచ్చిన శాన్‌ట్నర్ ఆఖరి బంతికి రెండు పరుగులు మాత్రమే తీశాడు. చివరి ఓవర్‌లో స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా ఒక సిక్సర్‌తో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమిపాలయింది.
మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ గురించి ప్రశ్నించగా.. అతను షాట్స్ కొట్టేందుకు ఇబ్బంది పడుతుండడంతోనే రిటైర్డ్ అవుట్‌గా పంపించామని సమాధానం ఇచ్చాడు. అయితే, హార్దిక్ నిర్ణయానికి ముంబై డగౌట్‌తో పాటు మాజీలు కూడా షాక్ అయ్యారు. తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ పై హెడ్ కోచ్ మహేల జయవర్ధనె కూడా స్పందించాడు. భారీగా పరుగులు సాధించాల్సిన డెత్ ఓవర్లల్లో తిలక్ వర్మ క్రీజ్‌లో ఇబ్బంది పడ్డాడని, తడబడ్డాడని వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో కొత్త బ్యాటర్ ఎవరైనా క్రీజ్‌లో ఉంటే బాగుంటుందని భావించినట్లు జయవర్దనె చెప్పాడు. ఓ బ్యాటర్‌ను రిటైర్డ్ అవుట్ చేయడం మంచిది కాదంటూనే వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని సమర్థించుకున్నాడు. కానీ గత మూడేళ్ళుగా ముంబై జట్టులో స్టార్ ప్లేయర్ గా ఉన్న తిలక్ వర్మను అవమానించారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. యువ ఆటగాడిని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా మ్యాచ్ మధ్యలో బయటకు పిలుస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.