IPL 2023: రెచ్చిపోదాం బ్రదర్ మన జట్టే మహా స్ట్రాంగ్

ఐ పి ఎల్ 2023 మాములుగా లేదు. జరిగిన ప్రతి మ్యాచులోనూ పరుగుల వరద పారుతూ ఉంది. ఈరోజు జరగబోయే మొదటి మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. అయితే ఈ రెండు జట్లు తలపడ్డ లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 61 పరుగులతో విజయాన్ని అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2023 | 01:30 PMLast Updated on: Apr 02, 2023 | 1:30 PM

Ipl 2023 Hyd Rajasthan Match

వాంఖడే గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచులో సంజు సాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ కాబట్టి, పరిస్థితులు రైజర్స్ కి అనుకూలంగా ఉంటాయి. కెప్టెన్ మార్క్ రమ్ లేకపోవడంతో ఆ బాధ్యతలను భువనేశ్వర్ కుమార్ భుజాన వేసుకుంటాడు. సం రైజర్స్ జట్టుకు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తారు. టెర్రిఫిక్ బ్యాట్స్ మెన్ హరీ బ్రుక్ వన్ డౌన్ లో దిగే అవకాశము ఉంది, రాహుల్ త్రిపాఠి, హేన్రిచ్ క్లాసేన్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్స్ తో రైజర్స్ మంచి జోష్ లో ఉంది.

బ్యాటింగ్ సైడ్ కానీ, బౌలింగ్ సైడ్ కానీ, రాజస్థాన్ రాయల్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా రైజర్స్ జట్టు కళకళలాడుతోంది. లాస్ట్ టైం రన్నరప్ గా నిలిచిన సంజూ స్క్వాడ్, ఈసారి కూడా భారీ అంచనాల మధ్య తన మొదటి మ్యాచ్ ఆడబోతుంది. జొస్ బట్లర్, యశస్వి జైస్వాల్, హెట్మేయెర్, దేవదూత్ పడిక్కాల్, జో రూట్ వంటి ప్లేయర్స్ తో పింక్ జట్టు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. ఉప్పల్ గ్రౌండ్ ప్రతిసారి లాగే బ్యాట్స్ మెన్ కు ఫెవర్ గా ఉండబోతుంది. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఊహించవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసిన జట్టు 180 రన్స్ వరకు టార్గెట్ నిలిపే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ పూర్తిగా సన్ రైజర్స్ బ్యాటింగ్ కి రాయల్స్ బౌలింగ్ కి మధ్య జరగబోతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.