Fixing: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జైషా..? డైరెక్ట్‌గా ధోనీకి కప్ ఇవొచ్చు కదా సర్..? ఎందుకి డ్రామాలు..?
టీవీ అంపైర్లకు కళ్లు కనపడడం లేదా? చెన్నై బ్యాటింగ్ చేస్తుంటే పదేపదే ప్రత్యర్థి బౌలర్లు నో బాల్స్ ఎందుకు వేస్తున్నారు..? బ్యాటర్లు చెన్నై ఫీల్డర్ల చేతిలో లడ్డూ లాంటి క్యాచ్‌లు పెట్టి మరీ ఎందుకు అవుట్ అవుతున్నారు..? ఏమో.. జైషా గారికే తెలియాలి.
గంగూలీని వాడుకొవాలని చూశారు.. పశ్చిమబెంగాల్‌లో మమత బెనర్జీకి పోటిగా దింపాలనుకున్నారు.. అయితే దాదా తన పని తాను చేసుకుపోయాడు.. రాజకీయాల్లో ఫింగర్ పెట్టలేదు.. ఇంకేముంది.. బీసీసీఐలో చక్రం తిప్పుతున్న బీజేపీ పెద్దలకు మండినట్టుంది.. సైలెంట్‌గా గంగూలీని సాగనంపారు. ఐసీసీలో ఉన్నత స్థానానికి వెళ్లాల్సిన గంగూలీ ఇప్పుడు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కనిపిస్తున్నాడు. ఇటు ధోనీని కూడా బీజేపీ వచ్చే ఏడాదికి క్యాంపెయినింగ్ కోసం వాడుకోవాలని చూస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి ఐపీఎల్‌ను ధోనీ కోసమే ఆర్గనైజ్ చేశారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి కామెంటేటర్లు నుంచి అభిమానులు వరకు ధోనీ జపమే చేస్తున్నారు. చెప్పాలంటే అది జపం కాదు.. భజన..! ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతుండడంతో అతని ఫ్యాన్స్‌కి బాధ ఉండడం సహజమే.. మరీ కామెంటేటర్లు ఎందుకు స్వామి సేవలో తరించుకుపోతున్నారో అర్థంకావడంలేదు. ఫ్యాన్స్ ఎమోషన్స్ వేరు..కామెంటేటర్ల బాధ్యత వేరు.. సరే ఇదంతా ధోనీ లాస్ట్ సీజన్ కావడంతో బీసీసీఐ ఇచ్చిన హైప్ అనుకుందాం..
ఇక్కడవరకు బాగానే ఉంది కానీ.. ఐపీఎల్ ప్లేఆఫ్ వేదికలపై ఇప్పుడు పలు టీమ్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు చెన్నై చెపాక్‌లోనే పెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని అడుగుతున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఓడే జట్టు ఆడే మ్యాచ్‌ను అహ్మాదాబాద్‌లోని మోదీ స్టేడియంలో పెట్టారు. ఈ షెడ్యూల్ అంతా ఎప్పుడో ఫిక్స్ చేసిందే.. అయితే ఎక్కడైతే వేదికలు పెట్టారో.. దానికి సంబంధించిన రెండు టీమ్‌లే తొలి రెండు స్థానాల్లో నిలవడం కొఇన్సిడెన్సేనా? క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోయింది.. ఇప్పుడా జట్టు మే 26న మోదీ స్టేడియంలో మరో మ్యాచ్ ఆడనుంది. అంటే అక్కడ పాండ్యా టీమ్‌కు హోం అడ్వాంటేజ్.
మరోవైపు క్వాలిఫయర్‌లోని రెండు మ్యాచ్‌లను చెపాక్‌లోనే ఎందుకు ఫిక్స్ చేశారు..? అంటే ధోనీ టీమ్ పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఏ పొజిషన్‌లో నిలిచినా వాళ్లకి బెనిఫిటే కదా.. మిగిలిన గ్రౌండ్లు ఏం పాపం చేశాయి..? చెన్నై టీమ్ రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్ ఆడింది.. ఒకవేళ మూడు..లేదా నాలుగు స్థానాల్లో నిలిచినా చెపాక్‌లోనే ఆడాలేగా షెడ్యూల్ చేయడంపై మిగిలిన జట్టు అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి రెండు నెలలు పాటు మ్యాచ్‌లు పెట్టడం దేనికని.. డైరెక్ట్‌గా ధోనీకి కప్ ఇవొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్‌లో ధోనీ టాప్ కెప్టెన్స్‌లో ఒకరు..అది ఎవరూ కాదనలేని నిజం.. అయితే ధోనీ కంటే రోహిత్ శర్మకు ఒక ఐపీఎల్ కప్ ఎక్కువ ఉంది..అది కూడా రోహిత్ ముంబై కెప్టెన్‌గా మారిన 10సీజన్లలోనే ఐదు కప్‌లు తీసుకొచ్చాడు. అటు చెన్నై కప్ గెలవాల్సిన ప్రతిసారి రోహిత్ టీమ్ అడ్డుపడింది. చెన్నైపై ముంబైదే డామినేషన్…అయితే ఈ సీజన్‌లో ముంబై చెన్నైతో ఆడిన రెండుసార్లు కూడా ఘోరంగా ఓడిపోయింది. అటు ధోనీని ఐదు ట్రోఫిలతో వీడ్కోలు పలికేలా చేయాలని.. అతని రిటైర్మెంట్ టైమ్‌కి ధోనీ ఖాతాలోనే ఎక్కువ ట్రోఫీలు ఉండాలని..అందుకే ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైనల్‌కు వెళ్లిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా సోషల్‌మీడియాలోనే..! వీటిలో నిజమెంతుందో తెలియదు కానీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం అన్నీ ధోనీకి, చెన్నైకి అనుకూలంగానే జరుగుతున్నాయి. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ క్వాలిఫయర్-1 మ్యాచ్.
క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు క్యాచింగ్ ప్రాక్టీస్ తరహాలో చెన్నై ఫీల్డర్ల చేతికి చిక్కడంపై మిగిలిన ఫ్రాంచైజీ జట్టు అభిమానులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆఖరి నిమిషంలో ప్లేఆఫ్ బెర్త్ ఛాన్స్ పొగొట్టుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుజరాత్, చెన్నై మ్యాచ్ చూసిన తర్వాత చిర్రెత్తుకొచ్చింది. సోష్‌ల్‌మీడియాలో ఫిక్సింగ్ అంటూ ట్రెండ్ స్టార్ట్ చేశారు..దానికి మిగిలిన ఓడిపోయిన జట్ల ఫ్యాన్స్ సపోర్టు చేశారు.
మరోవైపు బీసీసీఐలో జై షా అడుగుపెట్టిన తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫిని గుజరాత్ గెలుచుకుంది. మోదీ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌కు బీజేపీ నేతలు కూడా హాజరవడంతో అప్పట్లోనే ఐపీఎల్ ఫిక్స్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే గుజరాత్ టీమ్ బలంగానే ఉండడంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఆ వాదనను కొట్టిపడేశారు. ఇక ఈ ఏడాది మాత్రం నేరుగా క్రికెట్ ఫ్యాన్సే ఫిక్సింగ్ అంటూ మండిపడుతున్నారు. గుజరాత్ బ్యాటర్ విజయ్‌శంకర్ కొట్టిన బంతిని రుతురాజ్ గ్రౌండ్‌కు టచ్ అయ్యేలా క్యాచ్ పట్టినా..అంపైర్లు దాన్ని ఎలా అవుట్ ఇచ్చారో అర్థంకావడంలేదంటున్నారు. ఇదంతా బీసీసీఐ సెక్రటరీ జైషా స్క్రిప్ట్‌లో భాగమేనని.. ధోనీ జాగ్రత్తగా ఉండకపోతే గంగూలీకి పట్టిన గతే పడుతందని పలువురు హెచ్చరిస్తున్నారు.