IPL 2023: రికార్డును తిరగసారిన కలకత్తా వీళ్ళ దెబ్బకు పంజాబ్ చెత్త రికార్డు మాయం
ఐ ఫై ఎల్ 2023 క్యాచ్ రిచ్ లీగ్ లో కె కె ఆర్ నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో లాస్ట్ ఓవర్‌లో అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా కలకత్తా రికార్డులకెక్కింది. నిన్న జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌పై లాస్ట్ ఓవర్లో 29 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసిన నితీష్ రానా జట్టు.. ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.
ఇన్ని పరుగులను ఛేజ్ చేయడం 16 ఏళ్ల మెగా ఈవెంట్ చరిత్రలో ఇదే తొలి సారి. దీనికిముందు 2016లో లాస్ట్ ఓవర్‌లో ఇరవై మూడు పరుగుల టార్గెట్ ని పంజాబ్ కింగ్స్‌పై పుణేవారియర్స్ ఛేదించింది. నిన్నటి మ్యాచుతో పుణే వారియర్స్ రికార్డును కె కె ఆర్ బ్రేక్ చేసింది. ఇక పుణే తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంది. 2022 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై చివరి ఓవర్‌లో 22 పరుగుల టార్గెట్‌ను పాండ్యా జట్టు ఛేజ్ చేసింది.
ఇక జి టి -కేకేఆర్ మ్యాచ్ విషయానికి వస్తే..ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జి టి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 19 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది.
ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్‌లో కలకత్తా విక్టరీకి 29 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఊహకందని విధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు బాది కలకత్తా నైట్ రైడర్స్ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించడమే కాకుండా, అసలు సిసలు టీ 20 మజాను ప్రేక్షకులకు పంచాడు.