Bangalore Team: తీరు మారని బెంగళూరు.. తట్టుకుంటారా కలకత్తా పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 36వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈరోజు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది.
విరాట్ కోహ్లి సారథ్యంలో ఆర్ సి బి జట్టు రెండు మ్యాచ్‌లు వరుసగా గెలిచింది. ఒకటి, మొహాలీలో పంజాబ్ కింగ్స్‌పై, మరొకటి అప్పటి టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై. అదరగొడుతున్న టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తో పాటు గడిచిన రెండు గేమ్ లలో ఆ జట్టు నుండి అసాధారణమైన బౌలింగ్ తో పాటూ ఫీల్డింగ్‌ను అభిమానులు బాగా ఎంజాయ్ చేసారు. ఆర్సీబీ యొక్క ఫీల్డింగ్ నైపుణ్యాలు ఈ ఐ పి ఎల్ లో అత్యుత్తమంగా కొనసాగుతున్నాయి.
మరోవైపు, నితీష్ రాణా నేతృత్వంలోని నైట్ రైడర్స్ పరిస్థితి అయోమయంగా ఉంది. కలకత్తా వరుసగా 4 మ్యాచ్‌లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 వ నంబర్‌లో ఉంది. నితీష్ రాణా 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 181 పరుగులతో రిలయన్ట్ బ్యాటర్‌గా తనను తాను స్థిరపరచుకోవడంలో పదే పదే విఫలమవుతున్నాడు.
ఈ సీజన్‌లోని 9వ మ్యాచ్‌లో ఆర్సీబీ పై కలకత్తా 81 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, అప్పటి నుండి వారు రాణించలేకపోయారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వారి మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడటాన్ని అధిగమించాలని ఈసారి లక్ష్యంగా పెట్టుకుంది.