PBKS Vs RCB: సమానంగా ఇరుజట్ల స్టామినా.. పేస్ బౌలర్లకు స్వర్గధామం
పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ జట్లు ఇప్పటివరకు 30 సార్లు పోటీపడ్డాయి. అందులో పంజాబ్ జట్టు అత్యధికంగా 17 సార్లు విజయం సాధించగా, బెంగళూరు జట్టు 13 సార్లు పైచేయి సాధించింది. ఇరు జట్లు కూడా ఒకదానిపై ఒకటి 220కి పైగా అత్యుత్తమ స్కోర్ సాధించాయి.
PBKS Vs RCB: ఐపీఎల్ హిస్టరీలో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ జట్లు ఇప్పటివరకు 30 సార్లు పోటీపడ్డాయి. అందులో పంజాబ్ జట్టు అత్యధికంగా 17 సార్లు విజయం సాధించగా, బెంగళూరు జట్టు 13 సార్లు పైచేయి సాధించింది. ఇరు జట్లు కూడా ఒకదానిపై ఒకటి 220కి పైగా అత్యుత్తమ స్కోర్ సాధించాయి.
రెండు జట్ల మధ్య ఈరోజు జరిగే మ్యాచుకు సంబంధించి, మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఉన్న పిచ్ సాధారణంగా పేసర్లకు ఉపయోగపడుతుంది. మొహాలీ పెద్ద విస్తీర్ణం గల మైదానం కావడంతో బ్యాట్స్ మెన్‌కు వీలైనన్ని సింగిల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. నిజమైన బౌన్స్‌తో పాటు స్వింగ్ కూడా ఉండబోతుంది. ఆట చివరి సమయంలో మంచు కురిసే అవకాశం ఉంది. అందువల్ల ఈ వేదికపై రెండు జట్లకు కూడా గెలుపు అవకాశాలు సమానంగా ఉంటాయి.
మ్యాచులో ఆడబోయే జట్లను చూస్తే.. ఐపీఎల్ 2023 సీజన్‌ను విజయవంతంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి వాటిపై విజయాలు సాధించింది. శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్ ఫిట్‌నెస్ సమస్య ఎదుర్కొంటూ జట్టుకు దూరంగా ఉంటున్నారు. జట్టు వీరి రాక కోసం ఇంకా ఎదురుచూస్తున్నప్పటికీ, ఏ జట్టునైనా ఓడించగల సత్తా పంజాబ్‌కు ఉంది. అలాంటి అద్భుతమైన ఆటగాళ్ల లైనప్ పంజాబ్ సొంతం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించి డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయినప్పటికీ గత మ్యాచులో చెన్నై చేతిలో ఓడిపోయింది. ఓటమి తర్వాత జట్టు బరిలోకి దిగుతుండటంతో ఈసారి వీరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. అయితే, మెజారిటీ ఫ్యాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఫేవరెట్ జట్టుగా ఈరోజు కనబడుతోంది.
రెండు జట్లూ విజయం సాధించాలనే ఆసక్తితో మొహాలీలో మరో వినోదాత్మక గేమ్‌కు తెరలేపనున్నాయి.