CSK VS RCB: అదే జుట్టు.. అదే జోరు.. పాత ధోని పూనకాలు రిపీట్

గత సీజన్ వరకూ సీఎస్‌కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతోందనేది అనే ఆసక్తి రేపుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2024 | 06:15 PMLast Updated on: Mar 22, 2024 | 6:15 PM

Ipl 2024 Csk Vs Rcb Ms Dhonis Massive Comeback In The Season

CSK VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ జట్లు పోటీ పడనున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు డుప్లెసిస్ కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ వరకూ సీఎస్‌కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.

CSK VS RCB: చెపాక్‌లో ఫేవరెట్‌గా చెన్నై.. బెంగళూరుకు సవాలే

ఈ నేపథ్యంలో కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతోందనేది అనే ఆసక్తి రేపుతోంది. రాయల్ ఛాలెంజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్‌లో 31 సార్లు తలపడగా.. చెన్నైదే పైచేయి. తిరుగులేని విజయానలను అందుకుంది. ఐపీఎల్‌లో 20 సార్లు ఆర్సీబీని మట్టికరిపించింది సూపర్ కింగ్స్. ఆర్సీబీ 10 సార్లు మాత్రమే చెన్నైని ఓడించగలిగింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక ధోని, నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా.. ఐపీఎల్‌లో కొనసాగుతూ సారథిగా తన మహిమలు చూపించిన ధోనీ.. క్యాష్ రిచ్ లీగ్‌లో కూడా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసాడు. కెప్టెన్‌గా లీగ్ చరిత్రలోనే ఐదు టైటిళ్లు అందించిన ధోనీ.. అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేర్చిన ఘనతను కూడా అందుకున్నాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని.. ఆయనకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహీ తన హెయిర్ స్టైల్‌తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆ లాంగ్ హెయిర్ తో ధోని వస్తుంటే హాలీవుడ్ కటౌట్ వస్తోందని చెప్పేవారు.

కానీ ఎందుకో ధోని లాంగ్ హెయిర్ ను కంటిన్యూ చేయలేదు. కానీ ఇటీవల బాగా హెయిర్ ను పెంచేసిన ధోని వింటేజ్ లుక్ తో అభిమానులను అలరించడానికి సిద్దమయ్యాడు. కెరీర్ మొదట్లో ధోని,తన ప్రత్యేక హెయిర్ స్టయిల్‌తో భారత క్రికెట్ అభిమానులను ఒక ఊపు ఊపాడు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తరువాత, వింటేజ్ లుక్స్ తో కనిపిస్తున్న మహీని చూస్తుంటే, ధోని ఆనాటి మెరుపులు మళ్ళీ చూడబోతున్న అనుభూతికి లోనవుతున్నారు భారత క్రికెట్ అభిమానులు. మరి మహీ, తన వింటేజ్ హిట్టింగ్ తో ఫ్యాన్స్ ను ఎలా అలరించబోతున్నాడో, ఈ సమ్మర్.. సాక్ష్యంగా నిలబడనుంది.