CSK VS RCB: చెపాక్‌లో ఫేవరెట్‌గా చెన్నై.. బెంగళూరుకు సవాలే

చెన్నై గురించి మాట్లాడుకుంటే.. 12 ప్లే ఆఫ్స్, 10 ఫైనల్స్.. 5 ఐపీఎల్ ట్రోఫీలు.. ధోని సారధ్యంలోని సీఎస్‌కే ట్రాక్ రికార్డు ఇది. ఆర్సీబీ విషయానికొస్తే..ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా.. ఆ జట్టు మాత్రం నిలకడగా రాణిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2024 | 02:01 PMLast Updated on: Mar 22, 2024 | 2:02 PM

Ipl 2024 Csk Vs Rcb Who Wil Win The Match

CSK VS RCB: ఐపీఎల్ సంగ్రామం శుక్రవారం సాయంత్రం మొదలు కాబోతోంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీతో చెన్నై తలపడనుంది. రెండు జట్లకూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో రెండు జట్ల అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. చెన్నై గురించి మాట్లాడుకుంటే.. 12 ప్లే ఆఫ్స్, 10 ఫైనల్స్.. 5 ఐపీఎల్ ట్రోఫీలు.. ధోని సారధ్యంలోని సీఎస్‌కే ట్రాక్ రికార్డు ఇది. నిజానికి ఇది ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు. ఇది ఐపీఎల్‌లో ఆల్ టైమ్ రికార్డ్.

TDP THIRD LIST: చంద్రబాబు ఎవరికి హ్యాండ్ ఇచ్చారంటే..

సీనియర్ల జట్టని పేరున్నప్పటికీ.. మిస్టర్ కూల్ ధోని తన పదునైన ప్రణాళికలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీంగా మార్చాడు. అందుకే ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈసారి కూడా చెన్నై టీమ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌, డరిల్‌ మిచెల్‌, శివమ్‌ దూబె, జడేజా, మొయిన్‌ అలీ, రహానె వంటి వారితో లైనప్‌ డబుల్ స్ట్రాంగ్‌గా ఉంది. అంతేకాదు ఇదే జట్టులో 8.40 కోట్లకు కొనుక్కున్న 20 ఏళ్ల విధ్వంసక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సమీర్‌ రిజ్వీ కూడా ఉన్నాడు. బ్యాటింగ్ పరంగానే కాకుండా.. బౌలింగ్ పరంగా ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టడానికి జడేజా, మొయిన్‌ అలీ, శాంట్నర్‌ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. మన తెలుగు కుర్రాళ్లు అవనీశ్‌ రావు, షేక్‌ రషీద్‌ కూడా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. ఇక.. ఆర్సీబీ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా.. ఆ జట్టు మాత్రం నిలకడగా రాణిస్తోంది. 16 సీజన్లలో 8 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2009, 2011, 2016లో ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

డెక్కన్ ఛార్జర్స్, సీఎస్కే, సన్ రైజర్స్ చేతిలో ఆ జట్టు ఓడిపోయింది. ఈ సారి బెంగుళూరు ఫస్ట్ మ్యాచ్ లోనే టఫ్ టీమ్ చెన్నైను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. చెపాక్‌ స్టేడియంలో ఆర్సీబీకి చాలా చెత్త రికార్డు ఉంది. ఇదే ఆర్సీబీ అభిమానులను సీజన్‌ ప్రారంభానికి ముందు తెగ కలవర పెడుతోంది. అయితే ఐపీఎల్లో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు. 16 ఏళ్లుగా ఒక్క ట్రోఫీ నెగ్గకున్నా ఆర్సీబీకి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తుండటమే దీనికి మెయిన్ రీజన్. ఈ సీజన్‌లో ఆర్సీబీకి అతిపెద్ద బలం బ్యాటింగ్ యూనిట్ అనే చెప్పాలి. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. ఇక మైనస్‌ల విషయానికొస్తే.. బెంగళూరు బౌలింగ్ అటాక్ బలహీనంగా ఉంది. ముఖ్యంగా స్పిన్ యూనిట్లో పస కనిపించడం లేదు. దీంతో ఆర్సీబీ జట్టుపై మరింత ప్రెజర్ పెరిగింది. దీంతో తొలి మ్యాచులో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెన్నై సవాల్ విసరనుంది. మరి.. మొదటి మ్యాచ్ ఏ మేరకు ప్రేక్షకులకు మజా ఇస్తుందో చూడాలి.