Shubman Gill- Sai Sudarshan : గిల్ , సుదర్శన్ అరుదైన రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఓవర్ నుంచి గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ (Sai Sudarshan) బౌలర్లపై విరుచుకు పడ్డారు.

ipl 2024 Gill, Sudarshan is a rare record
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఓవర్ నుంచి గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ (Sai Sudarshan) బౌలర్లపై విరుచుకు పడ్డారు. ప్రతి బంతిని బౌండరీకి పంపుతూ ఇద్దరూ మైదానంలో మినీ సునామీని సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి ఒక పీడకలగా మార్చేస్తూ ఇద్దరు కలిసి చెరో సెంచరీ చేసేశారు.ఈ మ్యాచ్ లో ఈ జోడీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా అతి పెద్ద ఓపెనింగ్ ని గుజరాత్ జట్టుకు అందించింది. తొలి వికెట్ కు 17.2 ఓవర్లలో 210 పరుగుల భాగ్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించింది. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్స్ ఇద్దరూ శతకాలు చేయడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మొదటిసారి డేవిడ్ వార్నర్- జానీ బెయిస్టో (David Warner- Johnny Baisto) ఓపెనర్లుగా వచ్చి శతకాలు నమోదు చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శుభ్ మన్ గిల్- సాయి సుదర్శన్ ఇద్దరూ ఓపెనర్లుగా వచ్చి శతకాలు నమోదు చేసుకుని ఆ అరుదైన ఘనతను సాధించారు.