Glenn Maxwell: మ్యాక్సీపై వేటు తప్పదా..? ఫామ్ కోల్పోయిన మ్యాక్సీ
ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పక సత్తాచాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఆరు మ్యాచ్‌లు ముగిసినప్పటికీ సమర్థవంతమైన తుదిజట్టు సరిగ్గా సెట్ చేసుకోలేక పోయింది.

Glenn Maxwell: ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇపుడు హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. అయితే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పక సత్తాచాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.
Salman Khan: సల్మాన్ హత్యకు మరోసారి యత్నం.. ఇంటివద్ద కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా..?
ఆరు మ్యాచ్‌లు ముగిసినప్పటికీ సమర్థవంతమైన తుదిజట్టు సరిగ్గా సెట్ చేసుకోలేక పోయింది. భారీ అంచనాలు ఉన్న ప్లేయర్లు విఫలమవ్వడం, కొత్తగా అవకాశాలు ఇచ్చిన ఆటగాళ్లు నిరూపించుకోలేకపోవడం.. ఇలా ఎటూ చూసినా ఆర్సీబీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి సూపర్ ఫామ్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్ రాణించడమే కాస్త పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇక మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ ఫామ్‌లో లేకపోవడం బెంగళూరుకు మైనస్ పాయింట్. ఈ సీజన్‌లో మాక్స్‌వెల్ ప్రదర్శన తీసికట్టుగా ఉంది. మూడు సార్లు డకౌటయ్యాడు. ఈ నేపథ్యంలో మాక్సీని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ పెరుగుతోంది. బౌండరీ దూరం దగ్గరగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ భారీ హిట్టర్లు మాక్స్‌వెల్‌తో బౌలింగ్ చేయించడం మరింత ప్రమాదకరం.
అయితే మాక్సీ బ్యాటర్‌గా కుదురుకుంటే కొండంత లక్ష్యాన్ని కూడా చేజ్ చేయొచ్చు. దీంతో మాక్స్‌వెల్ విషయం ఆర్సీబీకి తలనొప్పిగా మారింది. కొనసాగించలేక, తప్పించలేక సతమతమవుతోంది. అయితే రేపటి మ్యాచ్‌లో మాక్సీకి చివరగా మరో అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది.