Rajasthan Royals: ఫుల్ పింక్ జెర్సీలో రాజస్థాన్ రాయల్స్.. కారణం ఏంటో తెలుసా ?
తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను, మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇదిలా ఉంటే నాలుగో మ్యాచ్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Rajasthan Royals: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ శనివారం తన నాలుగో మ్యాచ్ ఆడబోతోంది. సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లనూ గెలిచిన రాజస్థాన్.. ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను, మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
Prakash Raj: బీజేపీలోకి ప్రకాష్ రాజ్.. ఈ ప్రచారంలో నిజమెంత..?
ఇదిలా ఉంటే నాలుగో మ్యాచ్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. శనివారం నాటి మ్యాచ్‌లో జెర్సీని మార్చివేసింది. పూర్తిగా పింక్ కలర్‌తో నిండివున్న జెర్సీతో బరిలోకి దిగబోతోంది. ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌ను తమ రాష్ట్రంలో నివసించే మహిళలందరికీ రాజస్థాన్ రాయల్స్ అంకితం ఇచ్చింది. ఈ కొత్త జెర్సీని టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కర ఆవిష్కరించారు. ఔరత్ హై తో భారత్ హై, పింక్ ప్రామిస్ కాన్సెప్ట్‌తో మ్యాచ్ ఆడబోతోంది. కాగా ఈ మ్యాచ్ కోసం విక్రయించే ప్రతి టికెట్‌పై వచ్చే మొత్తంలో 100 రూపాయలను రాజస్థాన్ రాయల్స్ మహిళ సంక్షేమానికి కేటాయిస్తుంది.
రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌కు ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూతను కల్పించడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. అలాగే రెండు ఇన్నింగుల్లోనూ సిక్స్ కొట్టిన ప్రతీసారీ సంబార్ రీజియన్‌లోని ప్రతి ఆరు ఇళ్లల్లో సోలార్ పవర్ ద్వారా దీపాలను వెలగిస్తుంది.