Rishabh Pant: పంత్ తిరిగొస్తున్నాడు.. ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్ క్లియర్
కొద్ది రోజులుగా పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ప్రాక్టీస్ క్యాంప్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతని ఫిజికల్ ఫిట్‌నెస్ చూస్తే మనుపటి తరహాలోనే కనిపిస్తోంది. ప్రాక్టీస్ క్యాంప్‌లో పంత్ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు.
Rishabh Pant: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు సారథి రిషబ్ పంత్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్‌సీఏ ఇచ్చిన ఎన్‌ఓసీతో ఐపీఎల్ 17వ సీజన్ ఆడేందుకు పంత్‌కు లైన్ క్లియర్ అయినట్టే. ఎన్‌సీఏ నుంచి అధికారికంగా అనుమతి లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ పేరును జట్టులో చేర్చలేదు. గత కొద్ది రోజులుగా పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ప్రాక్టీస్ క్యాంప్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు.
Surya Kiran: విషాదం.. దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత.. కారణం ఇదే!
అతని ఫిజికల్ ఫిట్‌నెస్ చూస్తే మనుపటి తరహాలోనే కనిపిస్తోంది. ప్రాక్టీస్ క్యాంప్‌లో పంత్ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు. అయితే పంత్ వికెట్‌కీపింగ్ చేయడంపై మాత్రం డీసీ యాజమాన్యం ఆఖరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోదని సమాచారం. పంత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ ఓనర్లు ప్రకటింటారు. 2022 డిసెంబర్ 31న పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కొద్ది రోజుల కిందటే ఈ యువ వికెట్ కీపర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.
పంత్ ఎన్‌సీఏలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఫిట్‌నెస్ సాధించాడు. పంత్ గైర్హాజరీలో గతేడాది డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.