IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ చెన్నై వర్సెస్ బెంగళూర్
బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ మెగా టోర్నీ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. అయితే బీసీసీఐ తొలి 21 మ్యాచ్‌లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
INDIA TRAVEL: ఈ టూరిస్టు ప్లేసులకు వెళ్లే దమ్ముందా..? ఇండియాలో డేంజరస్ టూరిస్ట్ ప్లేసెస్
మార్చి 22న జరిగే ఈ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్ 7 వరకూ విడుదలైన షెడ్యూల్‌లో నాలుగు డబుల్ హెడర్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆరంభమైన రెండో రోజే రెండు మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో హోంగ్రౌండ్‌గా విశాఖను ఎంచుకుంది. విశాఖ స్టేడియంలో ఢిల్లీ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సీజన్‌లో మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30కి, రాత్రి మ్యాచ్‌లు 7.30 గంటలకు జరగనున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో అసలు ఐపీఎల్ ఇక్కడ ఉంటుందా లేదా అన్న అనుమానాలు నెలకొనగా.. తాజా షెడ్యూల్ ప్రకటనతో స్వదేశంలోనే లీగ్ జరగనుందని తేలిపోయింది. అయితే ఎన్నికల పోలింగ్, ఫలితాలు వంటి రోజుల్లో మ్యాచ్‌లు లేకుండా బీసీసీఐ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది.
దీని కోసమే మిగిలిన మ్యాచ్‌ల తేదీలు ఖరారు చేయలేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సెక్యూరిటీ ఏర్పాట్లు, ఇతరత్రా అంశాలపై కసరత్తు అనంతరం మిగిలిన మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్టు బోర్డు వెల్లడించింది. మొత్తం మీద స్వదేశంలోనే ఐపీఎల్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.