IPL 2024: మార్చి 22 నుంచి ఐపీఎల్..? ఎన్నికలతో ఇబ్బంది లేకుండా బీసీసీఐ ప్లాన్
ఈ ఏడాది జరగనున్న 17వ సీజన్ కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలయ్యాయి. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలిస్తారా అన్న సందేహాలకు బీసీసీఐ గతంలోనే తెరదించింది.
IPL 2024: వరల్డ్ క్రికెట్‌లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న లీగ్ ఐపీఎల్. ప్రతీ ఏడాది అటు క్రికెటర్లూ, ఇటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఎదురుచూస్తుంటారు. తమకు కాసుల పంట పండిస్తున్న ఐపీఎల్‌ను ఎప్పటికప్పుడు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. ఈ ఏడాది జరగనున్న 17వ సీజన్ కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలయ్యాయి. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలిస్తారా అన్న సందేహాలకు బీసీసీఐ గతంలోనే తెరదించింది.
REVANTH REDDY: తెలంగాణలో 18 జిల్లాలే.. రేవంత్ వ్యూహం అదేనా..
స్వదేశంలోనే ఈసారి ఐపీఎల్ సీజన్ నిర్వహిస్తున్నట్టు స్పష్టతనిచ్చింది. షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన చేయకున్నా.. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మొదలుకానుందని తెలుస్తోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నప్పటకీ.. వాటితో ఎటువంటి ఇబ్బంది లేకుండా బీసీసీఐ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఎక్కడైనా ఎన్నికలతో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ అయితే సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వేదికలకు మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం ముందుగానే ఆయా వేదికలను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు సూచించనుంది. ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జైషా దీనిపై అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. 2009, 2014లో ఎన్నికలు జరిగినప్పుడు ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించారు. 2020, 2021 సీజన్లు మాత్రం కరోనా కారణంగా విదేశాల్లో నిర్వహించాల్సి వచ్చినా.. తర్వాత వరుసగా రెండు సీజన్లు భారత్‌లోనే జరిగాయి.
విదేశాల్లో ఖర్చు కూడా ఎక్కువగానే ఉండడంతో ఫ్రాంచైజీలు స్వదేశీ ఆతిథ్యంవైపే మొగ్గు చూపుతున్నాయి. అందుకే ఈ సారి ఎన్నికలు ఉన్నప్పటకీ.. పక్కా ప్లానింగ్‌తోనే సీజన్‌ను నిర్వహించాలని బీసీసీఐ రెడీ అవుతోంది. మార్చి 22 నుంచే మెగా టోర్నీ ఆరంభయితే మే చివరి వారం వరకు జరగనుంది. ఇది ముగిసిన వెంటనే టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానుండడంతో మే చివరి వారం ఆరంభంలోనే ఫైనల్ జరిగే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.