IPL 2024: ఐపీఎల్ 2024లో కొత్త రూల్స్.. ఇకపై స్మార్ట్ రీప్లే సిస్టమ్ అమలు

గత ఏడాది ఇంపాక్ట్ ప్లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన బీసీసీఐ.. తాజా సీజన్ కోసం కూడా మరికొన్ని మార్పులు చేసింది. ఈసారి ఎస్ఆర్ఎస్ (స్మార్ట్ రీప్లే సిస్టమ్‌)ను ప్రవేశపెడుతోంది. అంటే అంపైర్ల నిర్ణయాలు మరింత కచ్చితత్వం, వేగంతో ఉండేలా ఎస్ఆర్ఎస్‌ను అమలు చేయబోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2024 | 08:53 PMLast Updated on: Mar 19, 2024 | 8:57 PM

Ipl 2024 Smart Replay System To Be Introduced For Accurate Reviews In Tournament

IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ను కూడా ఫ్యాన్స్‌కు నచ్చేలా తీర్చిదిద్దింది బీసీసీఐ. గత ఏడాది ఇంపాక్ట్ ప్లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన బీసీసీఐ.. తాజా సీజన్ కోసం కూడా మరికొన్ని మార్పులు చేసింది. ఈసారి ఎస్ఆర్ఎస్ (స్మార్ట్ రీప్లే సిస్టమ్‌)ను ప్రవేశపెడుతోంది. అంటే అంపైర్ల నిర్ణయాలు మరింత కచ్చితత్వం, వేగంతో ఉండేలా ఎస్ఆర్ఎస్‌ను అమలు చేయబోతుంది.

TDP LOKSABHA: టీడీపీ లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటించే అకాశం
అసలేంటి ఎస్ఆర్ఎస్
ఇప్పటికే డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) అమలులో ఉన్న సంగతి తెలిసిందే. 2018 నుంచి ఐపీఎల్‌లో డీఆర్ఎస్‌ అమలవుతోంది. అయితే, ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలు చేయనున్న సిస్టమ్ ఎస్ఆర్ఎస్. ఈ విధానంలో ఇప్పటి వరకు థర్డ్ అంపైర్, హాక్-ఐ ఆపరేటర్ల మధ్య మాధ్యమంగా ఉన్న టీవీ బ్రాడ్‌కాస్ట్‌ డైరెక్టర్ ఇకపై స్మార్ట్ రీప్లే సిస్టమ్‌లో ఉండరు. ఎస్ఆర్ఎస్‌లో టీవీ అంపైర్.. ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్ల నుంచి నేరుగా ఇన్‌పుట్‌లను స్వీకరిస్తారు. అంపైర్ల తరహాలోనే వీరిద్దరూ ఒకే గదిలో కూర్చుంటారు. గ్రౌండ్‌లోని ఎనిమిది హాక్ ఐ హైస్పీడ్ కెమెరాల ద్వారా క్యాప్చర్‌ చేసిన ఇమేజ్‌లను టీవీ అంపైర్‌కి అందజేస్తారు. ప్రతి గేమ్‌లో, క్రికెట్ గ్రౌండ్ చుట్టూ మొత్తం ఎనిమిది హాక్-ఐ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలను పెయిర్స్‌గా ఉంచుతారు. గ్రౌండ్‌కి రెండు వైపులా రెండు హ్యాక్ ఐ కెమెరాలు, స్ట్రైట్‌ బౌండరీల వద్ద రెండు, స్క్వేర్ లెగ్ పొజిషన్‌ రెండు వైపులా ఉంటాయి. దీని ద్వారా టీవీ అంపైర్ కోసం స్ప్లిట్ స్క్రీన్ ఇమేజ్‌లు సహా మరిన్ని విజువల్స్‌ను యాక్సెస్ చేస్తుంది.

హాక్-ఐ ఆపరేటర్.. బాల్‌ లెగ్ అవుట్‌సైడ్‌ పిచ్ అయినట్లు గుర్తిస్తే, అతను వెంటనే టీవీ అంపైర్‌కి చెబుతాడు. వారు బాల్ ట్రాకింగ్‌కి ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల ఫలితం త్వరగా, కచ్చితత్వంతో తెలుస్తుంది. ఇప్పటికే స్మార్ట్ రీప్లే సిస్టమ్‌పై బీసీసీఐ రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారిలో ఐపీఎల్ 2024లో 15 మంది అంపైర్లు ఎస్ఆర్ఎస్‌తో పని చేస్తారని భావిస్తున్నారు. గత ఐపీఎల్ వరకు, హాక్-ఐ కెమెరాలు బాల్-ట్రాకింగ్, అల్ట్రా ఎడ్జ్ కోసం మాత్రమే ఉపయోగించారు. ఇక IPL 2024, మార్చి 22న శుక్రవారం ప్రారంభం కానుంది. మొదటి మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.