Suryakumar Yadav: ముంబైకి గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వస్తున్నాడు..!
ఆ జట్టు స్టార్ ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఎన్‌సీఏ వైద్యులు స్కైకు ఫిట్‌నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.

Suryakumar Yadav: ఐపీఎల్ 17వ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఎన్‌సీఏ వైద్యులు స్కైకు ఫిట్‌నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.
Forbes Richest List 2024: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా విడుదల.. టాప్-10లో అంబానీ.. అదానీ స్థానం ఎంతంటే..
ఆదివారం ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్ సమయానికి స్కై వంద శాతం ఫిట్‌గా ఉంటాడని ఎన్‌సీఏకి చెందిన కీలక అధికారి వెల్లడించాడు. సూర్యకుమార్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్‌లో ముంబై ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ముంబై ఓడిన మూడు మ్యాచ్‌ల్లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. మడమ, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీల కారణంగా సూర్యకుమార్ యాదవ్ గత నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. రెండు సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసుకున్న స్కై.. మార్చి నుంచి ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్కైకు ఫిట్‌నెస్ పరీక్ష చేయగా అందులో విఫలమయ్యాడు.
టీ ట్వంటీ వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ప్లేయర్స్ ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోవడం లేదు. అయితే తాజాగా నిర్వహించిన రెండో పరీక్షల్లో స్కై పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తేలడంతో ఎన్‌సీఏ అతనికి ఐపీఎల్ అడేందుకు అనుమతిచ్చింది. దీంతో స్కూ ముంబై జట్టుతో చేరబోతున్నాడు. మరి స్కై రాకతో అయినా.. ముంబై విజయాల బాట పడుతుందో.. లేదో చూడాలి.