MS DHONI: ధోనీకి ఇదే చివరి సీజనా.. మహి ఏమన్నాడంటే ?
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన మహి ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు. సారథిగా తిరుగులేని రికార్డున్న ధోనీ నాలుగు టైటిల్స్ అందించాడు.
MS DHONI: ఐపీఎల్ సీజన్ 17వ సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన రాకున్నా మార్చి చివరి వారంలో 17వ సీజన్ మొదలు కానుంది. గత మూడేళ్లుగా ఐపీఎల్ ఎప్పుడు ఆరంభమైనా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన మహి ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు.
Revanth Reddy: సీఎం రేవంత్‌కు అస్వస్థత.. ఖండించిన సీఎంవో
సారథిగా తిరుగులేని రికార్డున్న ధోనీ నాలుగు టైటిల్స్ అందించాడు. ధోనీ బ్రాండ్‌తోనే చెన్నై జట్టుకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనేది అంగీకరించాల్సిందే. గత సీజన్‌తోనే అతని కెరీర్ ముగుస్తుందన్న వార్తల నేపథ్యంలో చెన్నై ఆడిన మ్యాచ్‌లకు స్టేడియాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఎప్పటిలానే రిటైర్ మెంట్‌పై స్పష్టంగా చెప్పని ధోనీ.. మరో సీజన్ ఆడతానంటూ హింట్ ఇచ్చాడు. దీంతో 2024 ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరిది కానుందన్న వార్తలు వస్తున్నాయి. వేలం ముగిసిన తర్వాత చెన్నై మరింత బలంగా మారిందన్న విశ్లేషణ నేపథ్యంలో ధోనీ వారసుడిని కూడా వచ్చే సీజన్ చివర్లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. నిజానికి ధోనీ ఎప్పుడు ఏం చేసినా ఆశ్చర్యకరంగానే చేస్తాడు.
ఇప్పుడు ఐపీఎల్ రిటైర్మెంట్ ప్లాన్స్‌లోనూ అలాంటిదే ఉండొచ్చని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే వచ్చే సీజన్ కోసం మహేంద్రుడు రెడీ అవుతున్నాడు. వరుసగా రెండు సీజన్‌లలో ఫ్లాప్ అయిన చెన్నైని 16వ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిపాడు. ఒకవేళ వచ్చే సీజన్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికినా.. చెన్నై జట్టుకు మెంటార్‌గానో, మరో బాధ్యతల్లో ధోనీ ఖచ్చితంగా ఉంటాడని ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.