ఐపీఎల్ మెగా వేలం లక్నో రిటైన్ ప్లేయర్స్ ఎవరంటే ?

ఐపీఎల్ మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ ఈ సారి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2024 | 03:15 PMLast Updated on: Sep 06, 2024 | 3:15 PM

Ipl 2025 Luknow Retain Players

ఐపీఎల్ మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ ఈ సారి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేస్తోంది. అదే సమయంలో ముగ్గురు కీలక ఆటగాళ్ళను రిటైన్ చేసుకోవడం దాదాపు ఖాయమైంది. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ను లక్నో ఖచ్చితంగా రిటైన్ చేసుకోనుంది.మ్యాచ్ లు ఫినిష్ చేసే సత్తా ఉన్న పూరన్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ దుమ్మురేపుతున్నాడు. గత రెండు సీజన్లలోనూ కలిపి 800కు పైగా పరుగులు చేసిన పూరన్ టీ ట్వంటీ ఫార్మాట్ లో వరల్డ్ వైడ్ గా పలు లీగ్స్ లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. మ్యాచ్ ను ఒంటిచేత్తో మలుపు తిప్పే పూరన్ లాంటి హిట్టర్ ను
లక్నో వేలంలోకి వదిలే అవకాశాలు లేవనే చెప్పాలి.

తర్నాత ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ను కూడా లక్నో తమతో పాటే కొనసాగించుకోనుంది. గత రెండు సీజన్లలోనూ స్టోయినిస్ అంచనాలు అందుకున్నాడు. 2023 సీజన్ లో 408 , 2024 సీజన్ లో 388 పరుగులు చేశాడు. బౌలర్ గానూ రాణిస్తూ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న స్టోయినిస్ ను రిటైన్ చేసుకునేందుకే లక్నో నిర్ణయించుకుంది. ఇక యువ పేసర్ మయాంక్ యాదవ్ ను కూడా లక్నో రిటైన్ చేసుకోవడం ఖాయం. 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మయాంక్ గత సీజన్ లో అదరగొట్టాడు. నాలుగు మ్యాచ్ లే ఆడినప్పటకీ వరుసగా రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన మయాంక్ యాదవ్ కు గాయాలు ఇబ్బందిగా మారాయి. అయినప్పటకీ 2025 సీజన్ సమయానికి ఈ యువ పేసర్ ఫిట్ నెస్ సాధిస్తాడని లక్నో ఫ్రాంచైజీ వర్గాలు భావిస్తున్నాయి.