IPL Cricket: వికెట్ల వేటలో ఇరు జట్లు.. ఆ వికెట్ నీది ఈ వికెట్ నాది..
ఈరోజు జరగబోయే ఆర్ సిబి, కె కె ఆర్ మ్యాచులో కొన్ని ఫన్నీ ప్రెడిక్షన్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అందులో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ కి మధ్య జరగబోయే స్పెల్ కూడా ఒకటి. ఓపెనర్ గా వస్తూ అదరగొడుతున్న కింగ్ కోహ్లీకి ఆదిలోనే చెక్ పెట్టే ఉదేశ్యంలో ఉంది కె కె ఆర్. అందుకు తగ్గట్టుగానే ఉమేష్ యాదవ్ ను అన్ని రకాల బంతుల్తో సిద్ధం చేస్తుంది.
విరాట్ వికెట్ తీయడానికి ఉమేష్ ప్రధానాస్రంగా వ్యూహాలు రచిస్తోన్న కె కె ఆర్ కు సునీల్ నరేన్ కూడా సీక్రెట్ ఏజెంట్ లా సేవలందించబోతున్నాడు. ఇక ఈ సీజన్‌లో షోలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ ఇప్పటికే 400 పరుగుల మార్కును అధిగమించాడు. ఫాఫ్ కి చెక్ పెట్టడానికి, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ రూపంలో స్పిన్ త్రయం సిద్ధంగా ఉంది.
ఇందులో ముఖ్యంగా ఫాఫ్‌ని తన ట్రాక్‌లో ఆపడానికి వరుణ్ చక్రవర్తి కీలకంగా మారనున్నాడు. ఆర్ సి బి మరో ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ఒంటరిగా ఆర్సీబీని ఫైనల్స్ కు చేర్చగల సమర్థుడు. కె కె ఆర్ విషయానికొస్తే, సుయాశ్, వరుణ్ చక్రవర్తిలు గింగిరాలు తిప్పే బంతుల్తో మాక్సీని ముట్టడి చేయనున్నారు. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో మహ్మద్ సిరాజ్ ధాటికి బతికిన బ్యాటర్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఐపీఎల్ 2023లో సిరాజ్ నైపుణ్యంతో జోస్ బట్లర్ వంటివారు కూడా పోరాడారు.
ఆర్సీబీ మీద జాసన్ రాయ్ ను తమ ట్రంప్ కార్డుగా భావిస్తోంది కలకత్తా జట్టు. చివరగా సి ఎస్ కే మీద ఆడిన ఆట, వాళ్ళ అంచనాల్ని మరింత పెంచేస్తున్నాయి. మరోవైపు చార్మినార్ ఎక్స్ ప్రెస్ మహమ్మద్ సిరాజ్ తన జాబితాలో మరిన్ని వికెట్లు చేర్చుకోవాలని చూస్తూ కెకెఆర్ జట్టును కమ్మెయ్యాలని ఉవ్విళూరుతున్నాడు. ముందు మ్యాచులో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్, ఈ మ్యాచులో తన తడాఖా చాటగలడు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.