IPL Royal Challengers Bangalore Rachin Ravindra : బెంగళూరు జట్టులో రచిన్?
వన్డే ప్రపంచకప్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం నమోదు చేసింది. దీంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించాడు.

IPL fans are of the opinion that if Royal Challengers Bangalore buy Ganaka Ravindra, IPL will be more exciting
వన్డే ప్రపంచకప్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం నమోదు చేసింది. దీంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించాడు. తాజాగా శ్రీలంకపైనా బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన రచిన్ లక్ష్య ఛేదనలో దూకుడుగా 42 పరుగులు సాధించాడు. అంతేకాకుండా తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడుతున్న రచిన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. అందులోనూ 25 ఏళ్లలోపు వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డును అధిగమించి రచిన్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిమానుల నోట తన పేరు మార్మోగడం కలగా అనిపిస్తోందని రచిన్ వ్యాఖ్యానించాడు. బెంగళూరులోనే అతడి తండ్రి తరఫు బంధువులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గనక రవీంద్ర కొనుగోలు చేస్తే, ఐపీఎల్ మరింత జోష్ ఫుల్ గా ఉంటుందని, ఐపీఎల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.