IPL Match: పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ గుజరాత్ బౌలింగ్
ఐ పి ఎల్ 2023 సంబంధించి, ఈరోజు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మొహాలీలో తలపడనున్నాయి. శిఖర్ ధావన్ నాయకత్వంలో పంజాబ్ జట్టు సాలిడ్ గా ఉంది. ఒక్క సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైనప్పటికీ, టైటిల్ ఫేవరైట్స్ లో ఒకటిగా ఐ పి ఎల్ క్రౌడ్ ముక్తకంఠంతో పంజాబ్ ను హోరెత్తిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ కూడా, ఏక్ ధమ్ క్వాలిటీ ఆటతో, దూసుకెళ్తుంది. హార్దిక్ లేకపోవడంతో రీసెంట్ మ్యాచులో రషీద్ ఖాన్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
ఈరోజు మ్యాచులో హార్దిక్ కమ్ బ్యాక్ అవుతాడని అంటుంది టైటాన్స్ మేనేజ్మెంట్. ఇక ఈ రెండు జట్ల పాత రికార్డ్స్ చూస్తే, చివరి సీజన్లో రెండు సార్లు తలపడ్డాయి. ఒక దాంట్లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే, మరో గేమ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు గెలిచింది. గుజరాత్ కి సంబంధించి సాయి సుదర్శన్, వృద్ధి మాన్ సాహాలకు మంచి రికార్డ్ ఉంది. పంజాబ్ లో శిఖర్ ధావన్, జితేష్ శర్మలకు టైటాన్స్ పై పట్టుంది. బౌలింగ్ విషయంలో లాకి ఫెర్గుసన్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్ లు కీలకంగా మారనున్నారు.
గుజరాత్ ఆఖరి మ్యాచులో కలకత్తా చేతిలో ఓటమి పాలైంది. పంజాబ్, సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఈ రెండు జట్లు కూడా తిరిగి తమ విన్నింగ్ స్ట్రీమ్ లోకి రావాలని, బౌన్స్ బ్యాక్ కోసం చూస్తున్నారు. పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ లాస్ట్ మ్యాచులో పేక మేడలా కూలిపోయింది. ఇక గుజరాత్ గెలవాల్సిన లాస్ట్ మ్యాచులో ఆఖరి ఐదు బంతులను సిక్సర్లుగా సమర్పించుకుని ఐ పి ఎల్ లో కొత్త రికార్డును మూటగట్టుకుంది. ఇలా రెండు జట్లు కూడా ఎన్నో ల్యాకింగ్ బాక్స్ తో అయోమయంలో ఉన్నాయి. ఒక్క గెలుపు ఈ రెండు జట్లలో మళ్ళీ జోష్ ను నింపేలా చేయనుంది. ఆ విన్నర్ ఎవరో తేలాలంటే, ఈరోజు మొహాలీ మ్యాచ్ చూడాల్సిందే.