IPL Cricket: టైటాన్స్ ముందు పంజాబ్ చిందు?

ఐ పి ఎల్ 2023 లో ఘోర పరాభవం పొందిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తో ఫైట్ చేయబోతుంది. కలకత్తా జట్టు మీద సంచలన పరాజయం మూటగట్టుకుని, ఇప్పుడు అంతకంత రేపట్టింపు స్పీడ్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. గుజరాత్ జట్టు బలం మొదటి నుంచి కూడా బ్యాటింగే. సాలిడ్ పార్ట్నర్ షిప్స్ బిల్డ్ చేయగల ఓపెనర్లు శుభ్ మాన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు జట్టుకు పెద్ద బలం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 05:00 PMLast Updated on: Apr 13, 2023 | 5:00 PM

Ipl T 20 Match 2023

విజయ్ శంకర్ కూడా ఫామ్ లోకి రావడం హార్దిక్ జట్టుకు ఊరట కలిగించే విషయం. మిల్లర్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా వంటి మిడిల్ ఆర్డర్ తో పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది గుజరాత్. బౌలింగ్ లో కూడా మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, జోషువా లిటిల్ లు నల్గురు తమదైన రోజున మ్యాచ్ విన్నర్లుగా సత్తా చాటగలరు. అయితే పంజాబ్ జట్టుతో ఈరోజు ఆడబోతున్న మ్యాచులో ముగ్గురు ఆటగాళ్లు గుజరాత్ టైటాన్స్ జట్టుకు ట్రంప్ కార్డులు కానున్నారు.

ఓపెనర్ వృద్ధిమాన్ సాహా అందులో ముందుటాడు. ఓపెనర్ గా వచ్చే సాహా, పంజాబ్ కి ఫస్ట్ చెక్ పెట్టబోతున్నాడు. ఆ తరవాత సాయి సుదర్శన్. రీసెంట్ గా దుమ్ముదులుతున్న ఈ యంగ్ ఛాంపియన్ ను, పంజాబ్ ఎంత త్వరగా పెవిలియన్ చేర్చితే అంత మంచింది. మూడో ప్లేస్ లో మెరుపులు మెరిపించే ఆటగాడిగా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ విజయ్ శంకర్ ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు చెలరేగినా కూడా పంజాబ్ కు వరుస ఓటమి తప్పదు. బౌలింగ్ లో యష్ దయాల్ కం బ్యాక్ అవుతాడని ఛాన్స్ ఇస్తారో లేదా, మరో స్పీడ్ స్టార్ ను జట్టులోకి తీసుకొస్తారో చూడాలి. ఐ పి ఎల్ 2023 లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన రషీద్ ఖాన్ తో పంజాబ్ ఇబ్బంది పడే సూచనలు లేకపోలేవు.