IPL TICKETS: బ్లాక్‌ మార్కెట్‌లో ఐపీఎల్ టికెట్స్‌.. ఒక్కోటి ఎంతంటే..

హైదరాబాద్‌, ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌లంటేనే గగనం. ఎప్పుడోసారి కానీ రావు. అలాంటిది ఐపీఎల్‌ పుణ్యమా అని.. ఏటా మ్యాచులు జరుగుతున్నాయి. ఎంచక్కా మ్యాచ్‌లు చూడొచ్చు అనుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2024 | 04:10 PMLast Updated on: Mar 26, 2024 | 4:10 PM

Ipl Tickets In Black Market For Hyderabad Match In Uppal Stadium

IPL TICKETS: ఐపీఎల్‌ టికెట్లు పక్కదారి పడుతున్నాయి. సైట్లోకి రాకముందే.. బ్లాక్‌ మార్కెట్లోకి వెళ్తున్నాయి. టికెట్లు బుక్‌ చేసుకునేందుకు క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంత ప్రయత్నిస్తున్నా.. క్షణాల్లో టికెట్లు మాయమవుతున్నాయి. ఈ సీజన్‌ ఐపీఎల్‌ టికెట్ల అమ్మాకాన్ని పేటీఎంకు అప్పగించింది బీసీసీఐ. పేటీఎం సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన కొద్దినిమిషాల్లోనే టికెట్లు సోల్డ్‌ అవుట్‌ అవుతున్నాయి. వేల టికెట్లు ఏమవుతున్నట్లు..?

CM RAMESH: అనకాపల్లిలో జగన్ భారీ వ్యూహం.. ఆయనకు అందుకే టికెట్.. సీఎంకు చుక్కలేనా..?

హైదరాబాద్‌, ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌లంటేనే గగనం. ఎప్పుడోసారి కానీ రావు. అలాంటిది ఐపీఎల్‌ పుణ్యమా అని.. ఏటా మ్యాచులు జరుగుతున్నాయి. ఎంచక్కా మ్యాచ్‌లు చూడొచ్చు అనుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది. మ్యాచ్‌లు జరుగుతున్నాయి కానీ.. టికెట్లు మాత్రం దొరకడం లేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు పెడతారు కానీ బుక్‌ అవవు. ఓపెన్‌ అయిన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోతాయి. అలా అని క్రికెట్‌ ఫ్యాన్స్‌కి దొరుకుతాయా అంటే అదీ లేదు. టికెట్ల కోసం ఉప్పల్‌ స్టేడియం వద్ద.. జింఖానా గ్రౌండ్‌ వద్ద వేలాది మంది పడిగాపులు కాస్తుంటే టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు కేటుగాళ్లు. బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతున్నారు. సైట్‌‌లో అప్‌లోడ్‌ చేయగానే.. నిమిషాల్లోనే వాటిని బ్లాక్‌ చేస్తున్నారు. ముఖ్యంగా 15 వందల నుంచి 6 వేల రూపాయల రేంజ్ టికెట్లు సైట్‌లో ఎంతవెతికినా కనపడవు. కేవలం 15 వేలు, 22 వేలు, 30 వేల రూపాయల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బ్లాక్‌ మార్కెట్‌ వెనక పేటీఎం బుకింగ్‌ సిబ్బంది హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి. స్టేడియం కెపాసిటీ 55 వేలు.. అందులో 60 శాతం టికెట్లు సేల్‌ చేసుకోవచ్చు.

మిగతా 40 శాతం స్పాన్సర్లు, హెచ్‌సీఏ, క్రికెట్‌ క్లబ్స్‌, క్రికెటర్ల కోటాలో కాంప్లిమెంటరీ కింద ఉంటాయి. అంటే.. కనీసం 35 వేల టికెట్లు అయినా అమ్మాలి. కానీ.. మూడు వేల టికెట్లు కూడా అమ్మలేదు. అవన్నీ అసలేమైనట్టు..? టికెట్ల వెనక పెద్ద బ్లాక్‌ దందానే జరిగిందా..? లేదా పక్కదారి పట్టాయా..? గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదరయ్యేది. అయితే కనీసం మ్యాచ్‌ టికెట్లు కనపడేవి. బుక్‌ చేస్తుంటే ఎర్రర్‌ వచ్చేది. లేదా.. పేమెంట్‌ వరకు వచ్చి ఆగిపోయేది. సర్వర్‌ బిజీ అని వచ్చేది. కానీ.. ఇప్పుడలా కాదు.. హైదరాబాద్‌ మ్యాచ్‌ టికెట్స్‌ అనేదే కానరావడం లేదు. మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు. వీఐపీలు, సెలబ్రిటీలు, అధికారులు.. చివరికి మంత్రులకూ తంటాలు తప్పడం లేదు. టికెట్ల కోసం హెచ్‌సీఏ పెద్దలకు వందలాది కాల్స్‌ వస్తున్నాయట. ఈ బ్లాక్‌ దందా వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.