బంగ్లాదేశ్ తో తొలి టీ20 నితీశ్ కు చోటు కష్టమేనా ?

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ సిరీస్ కు రెడీ అవుతోంది. సీనియర్లతో పాటు పలువురు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో టీ ట్వంటీ సిరీస్ లో కుర్రాళ్ళకు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ జట్టు బంగ్లాను స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 4, 2024 | 12:39 PMLast Updated on: Oct 04, 2024 | 12:39 PM

Is It Difficult For Nitish To Have A Place In The First T20 Against Bangladesh

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ సిరీస్ కు రెడీ అవుతోంది. సీనియర్లతో పాటు పలువురు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో టీ ట్వంటీ సిరీస్ లో కుర్రాళ్ళకు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ జట్టు బంగ్లాను స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ ట్వంటీకి భారత తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2026 టీ ట్వంటీ వరల్డ్ కప్ కు కోర్ టీమ్ ను రెడీ చేస్తున్న గంభీర్ కుర్రాళ్ళకే అవకాశాలివ్వాలని భావిస్తున్నాడు. అయితే తుది జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆల్ రౌండర్ల కోటాలో హార్థిక్ పాండ్, శివమ్ దూబే నుంచి గట్టిపోటీ నెలకొనడమే దీనికి కారణం.

జింబాబ్వే టూర్ కు ఎంపికైనా గాయంతో దూరమైన నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బంగ్లాతో సిరీస్ కు సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. నితీశ్‌కు తొలి టీ20లో ఛాన్స్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాగా జైస్వాల్, గిల్‌కు విశ్రాంతి ఇవ్వండంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌ తొలి టీ20లో బరిలోకి దిగనున్నారు. ఇక వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్య, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వస్తారు. ఇక అర్షదీప్ సింగ్‌తో పాటు మయాంక్ యాదవ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరికి తుదిజట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. శ్రీలంక పర్యటనకు కూడా ఎంపికైన హర్షిత్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఇక మరో స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. కాగా అక్టోబర్ 6న తొలి టీ ట్వంటీ జరగనుండగా.. మిగిలిన రెండు మ్యాచ్ లకు న్యూఢిల్లీ, హైదరాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి.