పంత్ కు ఇక బెంచ్ కే తుది జట్టు చోటు కష్టమేనా ?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. లీగ్ స్టేజ్ లో ఇక న్యూజిలాండ్ తో చివరి మ్యాచ్ ఆడబోతోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. లీగ్ స్టేజ్ లో ఇక న్యూజిలాండ్ తో చివరి మ్యాచ్ ఆడబోతోంది. తుది జట్టు కూర్పు ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇక బెంచ్ కే పరిమితం కానున్నాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తంలో అనేక మ్యాచ్ లలో వన్డే క్రికెట్ లో భాగస్వామ్యమైన రిషబ్ పంత్.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. జట్టులో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, బ్యాటర్ గా ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా కేఎల్ రాహుల్ జట్టులో ఆడటం ఖాయమని తేల్చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్, కోహ్లి వంటి సీనియర్ క్రికెటర్లు విఫలం కాగా…పంత్ మాత్రం బ్యాట్‌తో రాణించాడు.
కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా రాహుల్ కనిపించాడు. బంగ్లాదేశ్‌పై రాహుల్ 41 పరుగులు చేశాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. న్యూజిలాండ్‌తో మార్చి 2న జరిగే మ్యాచ్‌లో రిషబ్ పంత్ బరిలో దిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో అతడి స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించే అవకాశం ఉందని భావించారు. అయితే అందులో నిజం లేదని, తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ రిషబ్ పంత్ బెంచ్‌కు పరిమితం కానున్నట్లు సమాచారం. జట్టు కూర్పు బాగా సెట్టయిందని, ఈ ఫ్లోను దెబ్బతీయకూడదనే ఆలోచనలో కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు తెలిసింది.కేఎల్ రాహుల్ వైపే గంభీర్ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు మాజీ క్రికెటర్లు గవాస్కర్‌తో పాటు సంజయ్ మంజ్రేకర్ కూడా తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. విన్నింగ్ కాంబినేషన్‌ను ఛేంజ్ చేయడం వల్ల జట్టుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఫ్యాన్స్ మాత్రం పంత్ ను తుది జట్టులో ఆడిస్తే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. పంత్ అరుదైన ఆటగాడు. అలాంటి టాలెంటెడ్ క్రికెటర్ బెంచ్‌కు పరిమితం కావడం ఇబ్బందేననీ విశ్లేషిస్తున్నారు. కానీ రాహుల్‌ను తప్పించి మరో కీపర్‌ను ఛాన్స్ ఇచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. మాజీ క్రికెటర్ల మాటలను బట్టి చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ తదుపరి మ్యాచ్‌లలో పంత్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు కనపించడం లేదు. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్ల తో మనం ఆడలేమని ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తేల్చేశాడు. ఈ ప్రకటనను బట్టి రిషబ్ పంత్ కు ప్రస్తుతం ప్లేయింగ్ 11లో అవకాశం రావడం చాలా కష్టమని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కావచ్చు. పంత్‌తో పాటు ఆర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.