ఆమెతో పాండ్యా డేటింగ్ నిజమే ? ముంబై టీం బస్సులో జాస్మిన్
క్రికెటర్ల పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తూనే ఉంటాయి... కానీ నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఇలాంటి రుమార్స్ రావు..

క్రికెటర్ల పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు గాసిప్స్ వస్తూనే ఉంటాయి… కానీ నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఇలాంటి రుమార్స్ రావు.. ముఖ్యంగా క్రికెటర్ల గాళ్ ఫ్రెండ్స్ విషయంలో చాలాసార్లు రెస్టారెంట్స్ కో, పబ్బులకో వెళ్ళి దొరికిపోతుంటారు. ఐపీఎల్ లాంటి మెగా లీగ్ జరుగుతున్నట్టు ఆయా క్రికెటర్ల గాళ్ ఫ్రెండ్స్ స్టేడియంలో కనిపించారంటే ఇక డేటింగ్ కన్ఫర్మ్ అయినట్టే.,.. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా విషయంలో ఇదే జరుగుతోంది. హార్దిక పాండ్యాతో బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా డేటింగ్‌లో ఉన్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా వీరిద్దరూ ప్రకటించకున్నా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావడం, కొన్నిసార్లు సీక్రేట్ గా కలుసుకున్నట్టు వార్తలు రావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు అనుకుంటున్నారు. ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా వేదికల్లో ఒకే రకమైన ఫోటోలు షేర్ చేయడాన్ని గమనించిన ఫ్యాన్స్ పుకార్లు ప్రారంభించారు. ఇద్దరూ గ్రీస్‌లో వెకేషన్ గడిపారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్‌డ్రాప్ గ్రీస్ నేపధ్యం ఉండటం దీనికి కారణం.
వీటిని బలపరుస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ , ముంబై మ్యాచ్ లో జాస్మియా స్టేడియంలో సందడి చేసింది. వీఐపీ స్టాండ్ నుంచి హార్దిక్ టీమ్‌కు సపోర్ట్ చేస్తూ కనిపించింది. బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో స్టైలిష్‌గా ఉన్న జాస్మిన్.. పిచ్ వైపు చూస్తూ నవ్వులు చిందించింది. కెమెరాలు ఆమెను చాలాసార్లు క్యాప్చర్ చేశాయి. మ్యాచ్‌కు ఆమె చీర్స్ వల్ల ఎక్స్‌ట్రా ఎనర్జీ యాడ్ అయ్యిందని ఫ్యాన్స్ అంటున్నారు. కోల్‌కతాపై 8 వికెట్ల తేడాతో గెలిచిన ముంబై, ఈ సీజన్‌లో ఫస్ట్ విక్టరీ కొట్టింది.
పైగా మ్యాచ్ అనంతరం హార్దిక్‌తో కలిసి జాస్మిన్ టీమ్ బస్సులో వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ అఫీషియల్ అయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ ఆడుతున్న మ్యాచ్ సమయంలో జాస్మిన్ వాలియా టీమిండియా ఉత్సాహపరుస్తూ కనిపించింది. హార్దిక్ పాండ్యా నటి, సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గ్రీస్ వెకేషన్ లో ఫోటోలు, వీడియోలలో ఇద్దరూ పోజులివ్వడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం వివిధ మ్యాచ్ లకు ఈ అందాల భామ హాజరు కావడంతో ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. భారత సంతతికి చెందిన బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియా ఇంగ్లాండ్ లోని ఎసెక్స్ లో జన్మించింది. జాస్మిన్ సింగర్‌గా, యాక్టర్‌గా కెరీర్‌లో ముందుకు సాగుతోంది. బిగ్‌బాస్ 13 ఫైనలిస్ట్ ఆసిమ్ రియాజ్‌తో కలిసి 202లో నైట్స్ ఎన్ ఫైట్స్ మ్యూజిక్ వీడియో విడుదల చేసింది.ఇప్పుడు హార్దిక్‌తో లింక్ అప్‌తో ఆమె ఫేమ్ ఇంకా పెరిగింది.