ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ
ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో సాల్ట్ వరుసగా వైఫల్యం చెందుతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. సాల్ట్ 3 మ్యాచ్‌లలో 9 పరుగులు మాత్రమే చేశాడు. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 బంతులు ఎదుర్కొని సున్నాతో వెనుదిరిగాడు.
ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో సాల్ట్ వరుసగా వైఫల్యం చెందుతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. సాల్ట్ 3 మ్యాచ్‌లలో 9 పరుగులు మాత్రమే చేశాడు. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 బంతులు ఎదుర్కొని సున్నాతో వెనుదిరిగాడు. దీని తర్వాత చెన్నైలో జరిగిన రెండో మ్యాచ్‌లో 3 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి హార్దిక్ పాండ్యాకు బలయ్యాడు. ఓ వైపు బెన్ డకెట్, లివింగ్స్టన్ లాంటి స్టార్ క్రికెటర్లు విజృంభించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇవ్వగా వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ మాత్రం పేలవ పామ్ తో ఆర్సీబీ కొంప ముంచేటట్టు ఉన్నాడు.
మెగవేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది. సాల్ట్ ఇలాగే బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. సాల్ట్ ఫామ్ కొనసాగకపోతే ఆర్సీబీ మరో ఓపెనర్ కోసం వెతుక్కోవాల్సిందే. మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిల్ సాల్ట్‌ను 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. నిజానికి ఫిల్ సాల్ట్ ని తక్కువ అంచనా వేయలేం.
గతేడాది కేకేఆర్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.ప్లేఆఫ్‌లు లేదా ఫైనల్స్‌లో భాగం కానప్పటికీ ఆరంభ మ్యాచుల్లో బలమైన ప్రదర్శన ఇచ్చాడు. గత సీజన్లో మొత్తం 12 మ్యాచ్‌లలో 182 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 4 హాఫ్ సెంచరీలు సాధించి 435 పరుగులు చేశాడు. మరో ఆర్సీబీ ఆటగాడు బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ మాత్రం ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. తొలి రెండు టీ20ల్లో విఫలమైనా కీలకమైన మూడో మ్యాచ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.దూకుడుగా ఆడుతూ 24 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో సాయంతో 43 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.