Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఆసియాకప్ గ్రహణం తప్పదా..?
టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రావడం చాలా కష్టం అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్.
Suryakumar Yadav: ఆసియా కప్ 2023లో ఎంపికైనప్పటికీ ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేని భారత క్రికెట్ జట్టు ఆటగాడు ఒకరు ఉన్నారు. ఎందుకంటే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతనికి టోర్నమెంట్‌లోని ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వరని తెలుస్తోంది. అతడే టీ 20 నంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది.
టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రావడం చాలా కష్టం అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్. సూర్యకుమార్ యాదవ్ భారత్ తరపున 26 వన్డేల్లో 24.33 సగటుతో 511 పరుగులు చేశాడు. మిస్టర్ 360 ప్లేయర్ గత 10 వన్డే ఇన్నింగ్సుల్లో చూస్తే ఒక్క దాన్లో కూడా.. కనీసం 40 పరుగులు చేయలేకపోయాడు. ఆసియా కప్ 2023 కోసం ఎంపిక చేయబోయే ప్లేయింగ్ 11లో సూర్యకుమార్‌ను ఎంచుకుంటే మాత్రం టీమిండియా పరిస్థితులు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది.
సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం ఆసియా కప్ 2023 ట్రోఫీని గెలుచుకోవాలనే భారత్ కలను కూడా విచ్ఛిన్నం చేయగలదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోహిత్, సూర్యను నమ్ముతాడా లేదా అనేది టీమిండియా అభిమానుల్లో ఒకింత ఉత్కంఠకు తెరలేపింది.