T20, World Cup : సూపర్ 8 మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉందా ? వర్షంతో మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి.

Is there a reserve day for the Super 8 match? This is what happens when a match is canceled due to rain
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. పాయింట్లు పంచుకోవాల్సి రావడం పలు పెద్ద జట్లకు ఇబ్బందికరంగానే మారింది. ఇక సూపర్ 8 మ్యాచ్ లకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అన్ని జట్లకు టెన్షన్ మొదలైంది. జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు మొదలుకానున్నాయి. అయితే సూపర్ 8 రౌండ్‌లో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడితే ఏం జరుగుతుంది…రిజర్వ్ డే ఉందా అన్నదానిపై ఫ్యాన్స్ ఐసీసీ వరల్డ్ కప్ రూల్స్ ను శోధిస్తున్నారు.
గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌ల మాదిరిగానే సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్ డేని కేటాయించలేదు. వర్షం పడితే ఎలాగైనా అదే రోజు మ్యాచ్ పూర్తి చేయాలి. మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడించాలి. ఒకవేళ అది కూడా కుదరకపోతే మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. ఇది ఒక విధంగా అన్ని జట్లకు ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే సూపర్-8 రౌండ్‌లో ఒక్కో జట్టు 3 మ్యాచ్‌లు ఆడుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. జట్లకు భారీ నష్టం తప్పదు. గ్రూప్ దశతో పోలిస్తే సూపర్ 8 రౌండ్‌లో అన్ని జట్లూ ఒక మ్యాచ్ తక్కువ ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వర్షం కారణంగా 1 మ్యాచ్ రద్దయితే జట్లు తర్వాతి రౌండ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.