ఇదేం పిచ్చి స్ట్రాటజీ ? ధోనీ బ్యాటింగ్ ప్లేస్ పై విమర్శలు

చెన్నై, ఆర్సీబీ మధ్య మ్యాచ్ అంటే అభిమానులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. గెలుపు ఎవరిదైనా కూడా చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగుతుందని ఎదురుచూస్తారు. పైగా గతంలో చాలాసార్లు నరాలు తెగే ఉత్కంఠగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2025 | 08:21 PMLast Updated on: Mar 29, 2025 | 8:21 PM

Is This A Crazy Strategy Criticism On Dhonis Batting Position

చెన్నై, ఆర్సీబీ మధ్య మ్యాచ్ అంటే అభిమానులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. గెలుపు ఎవరిదైనా కూడా చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగుతుందని ఎదురుచూస్తారు. పైగా గతంలో చాలాసార్లు నరాలు తెగే ఉత్కంఠగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగాయి. కానీ ఈ సీజన్ లో మాత్రం చెన్నై పిచ్చి స్ట్రాటజీ, చెత్త ఫీల్డింగ్ తో వార్ వన్ సైడ్ గా ముగిసింది. అసలు ఏ దశలోనూ సీఎస్కే పోటీ ఇవ్వలేకపోయింది. వాస్తవానికి గత రికార్డులు ఆధారంగా అందరూ ఈ సారి చెన్నై గెలుస్తుందనుకుంటే, అంచనాలను తారుమారు చేస్తూ 50 పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో సీఎస్కే ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు.. ఇదే సమయంలో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మహీ అలా వచ్చి వెళ్లిపోవడం వల్ల జట్టుకు ఏం ప్రయోజనం అని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఆర్సీబీతో మ్యాచులో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే వాస్తవానికి 13వ ఓవర్లో శివం దూబే ఔట్ అయ్యాక.. ధోనీ బ్యాటింగ్ కు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వచ్చారు.తర్వాత ధోనీ 16వ ఓవర్లో వచ్చాడు. అయితే 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా పెద్దగా ఫలితంగా ఉండదు. అప్పటికే మ్యాచ్ చేతులు దాటిపోయే అవకాశం ఉంటుంది. అయితే మహీ రాగానే 16 బంతుల్లోనే రెండు సిక్స్ లు, మూడు ఫోర్ల సాయంతో 30 పరుగులు ధీటుగానే ఆడాడు.దీంతో ఇదే మహీ ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితంగా మరోలా ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ అందుకునేదని అభిప్రాయపడుతున్నారు. 43 ఏళ్ల వయసలోనూ మంచి ఫామ్ లో ఉన్న ధోనీ.. ముందుగా వచ్చి మరికొన్ని ఎక్కువ రన్స్ సాధించి ఉంటే మ్యాచ్ అవలీలగా గెలిచేది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

197 పరుగుల లక్ష్యంలో 100 పరుగులకే సీఎస్కే కష్టాల్లోకి వెళ్లిపోతే.. ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఉపయోగమేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తొమ్మిదో ప్లేస్ లో వచ్చి రెండు సిక్స్ లు బాదడటం పీఆర్ స్టంటా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్స్ కోసం కేవలం కొన్ని సిక్స్ లు బాదితే, అది విజయాన్ని అందించదనీ చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో సీఎస్కే మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. కాగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ బిగ్ ఫైట్ లో రజత్ పటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ వన్ సైడ్ విక్టరీ కొట్టింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నైపై ఆర్సీబీ గెలుపొందింది.