షెడ్యూల్ ఇలాగేనా చేసేది ? ఐసీసీపై సఫారీ బ్యాటర్ ఫైర్

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో మరోసారి సౌతాఫ్రికా బోల్తా పడింది. టైటిల్ ఫేవరెట్ గా భావించిన సఫారీలు సెమీస్ లో న్యూజిలాండ్ పై పరాజయం పాలయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2025 | 04:20 PMLast Updated on: Mar 07, 2025 | 4:20 PM

Is This How The Schedule Used To Be Safari Batter Fires At Icc

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో మరోసారి సౌతాఫ్రికా బోల్తా పడింది. టైటిల్ ఫేవరెట్ గా భావించిన సఫారీలు సెమీస్ లో న్యూజిలాండ్ పై పరాజయం పాలయ్యారు. భారీ టార్గెట్ ను ఛేదించలేక చేతులెత్తేశారు. డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అయితే కివీస్ చేతిలో ఓటమి తర్వాత డేవిడ్ మిల్లర్ ఐసీసీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. చెత్త షెడ్యూలింగ్ చేశారంటూ మండిపడ్డాడు. హడావుడి గందరగోళ షెడ్యూల్ కారణంగానే సెమీస్ కోసం సన్నద్ధం అయ్యేందుకు తమ జట్టుకు తగినంత సమయం దొరకలేది ఆరోపించాడు.

ఐదు గంటలు జర్నీ కే టైమ్ సరిపోయిందంటూ ఫైర్ అయ్యాడు. తాము అలా జర్నీ చేయడం కరెక్ట్ కాదన్నాడు. ముందుగా దుబాయ్ లో మ్యాచ్ కోసం సాయంత్రం 4 గంటలకు వచ్చామన్నాడు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ పూర్తవ్వగానే ‌ తర్వాత రోజే ఉదయం 7.30 గంటలకు మళ్లీ పాకిస్థాన్ కు బయలుదేరామన్నాడు. అసలు అది సరైంది కాదన్న మిల్లర్ ఐదు గంటలు పాటు జర్నీ చేశామని గుర్తు చేశాడు. మొత్తం 5 గంటలు పాటు జర్నీ చేస్తే తమ ప్రాక్టీస్‌కు సమమం ఎక్కడుందని మిల్లర్ ప్రశ్నించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లోని ఆఖరి లీగ్ మ్యాచ్‌ వరకు సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో తలపడబోతోందనే విషయంలో క్లారిటీ రాలేదు. టీమిండియా సెమీస్‌కు వెళితే ఆ మ్యాచ్ దుబాయ్‌లోనే నిర్వహిస్తామని ఐసీసీ ముందే షెడ్యూల్‌‌లో ప్రకటించింది. అందుకే గ్రూప్ బిలోని ఆస్ట్రేలియా , సౌతాఫ్రికా జట్లు రెండు కలిసి దుబాయ్‌కు వెళ్లాయి. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి పాయింట్స్ టెబుల్‌లో టాప్‌లో నిలిచింది. ఈ క్రమంలో ఫస్ట్ సెమీస్ ఫైనల్ కోసం ఆసిస్ జట్టు దుబాయ్‌ లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం తిరిగి పాకిస్థాన్‌కు తప్పక వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సెమీఫైనల్ ఆడి కివీస్ చేతిలో పరాజయం పాలైంది. తమ ఓటమిని ఒకవిధంగా షెడ్యూలింగే కారణమంటూ మిల్లర్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే కివీస్ తో మ్యాచ్ మ్యాచ్ తర్వాత మిల్లర్ ఇచ్చిన మరో స్టేట్ మెంట్ కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా భారత క్రికెట్ ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఫైనల్లో తాను న్యూజిలాండ్ జట్టుకు సపోర్ట్ చేస్తానని మిల్లర్ వ్యాఖ్యానించాడు. మిల్లర్ స్టేట్ మెంట్ తో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. సౌతాఫ్రికాకు ఐసీసీ టైటిల్స్ రావాలని ఇండియా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని గుర్తు చేస్తున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడు కూడా సఫారీలపై సింపతీ చూపించామంటూ చెబుతున్నారు. కానీ మిల్లర్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ కు సపోర్ట్స్ చేస్తానని బహిరంగంగానే చెప్పడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.