Litton Das: బంగ్లా కెప్టెన్ గొప్ప మనసు.. ఔటైనా కూడా వెనక్కి పిలిచి..
46వ ఓవర్ వేయడానికి హసన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్‌లో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఇష్ సోధి ఉన్నాడు. ఈ క్రమంలో హసన్ బంతిని వేసే క్రమంలో, క్రీజు వదిలి ముందుకు వెళ్లిన సోధిని మన్కడింగ్ రూపంలో రనౌట్ చేశాడు.
Litton Das: ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. వన్డే ప్రపంచకప్ 2023 సన్నాహకాల్లో భాగంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. అందులో భాగంగా శనివారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. టామ్ బ్లండెల్, హెన్రీ నికోల్స్, ఇష్ సోధి రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, అహ్మద్‌లు చెరో మూడు వికెట్లు.. ముస్తఫిజుర్ రెండు వికెట్లు సాధించాడు.
ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ షకీబుల్ హసన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో లిట్టన్ దాస్ సారథిగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు తన గొప్ప మనసును చాటుకున్నాడు. 46వ ఓవర్ వేయడానికి హసన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్‌లో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఇష్ సోధి ఉన్నాడు. ఈ క్రమంలో హసన్ బంతిని వేసే క్రమంలో, క్రీజు వదిలి ముందుకు వెళ్లిన సోధిని మన్కడింగ్ రూపంలో రనౌట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సోధి రనౌట్ న్యాయబద్దమే. అయితే అంపైర్‌తో మాట్లాడిన లిట్టన్ దాస్, ఇష్ సోధిని మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చాడు. ప్రస్తుతం లిట్టన్ దాస్ నిర్ణయం పట్ల నెటిజన్లు కామెంట్స్ రూపంలో ప్రశంసిస్తున్నారు. సోధి మన్కడింగ్ అయిన సమయంలో 17 పరుగులు చేశాడు. అనంతరం మరో 18 పరుగులు జోడించాడు.
మన్కడింగ్‌ను చట్టబద్దం చేసినప్పటికీ దానిని కొందరు ప్లేయర్లు అనైతికంగానే భావిస్తున్నారు. ఇక ఇటీవలే ముగిసిన ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్ సూపర్ 4 నుంచే నిష్క్రమించింది. అయితే తన చివరి మ్యాచ్‌లో భారత్‌పై అద్భుత విజయాన్ని అందుకోవడం ఆ జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపింది.