Ishan Kishan: నంబర్ 4 కోసం.. రోహిత్ ప్లాన్ సూపర్..!
టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడీ చూస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతారు. ఒకవేళ ఇషాన్ జట్టులోకి వస్తే గిల్ లేదా రోహిత్ దిగువన ఆడక తప్పదని చర్చ సాగుతోంది. అలా కాకపోతే గిల్ నంబర్ 3లో, కోహ్లీ నంబర్ 4లో ఆడే అవకాశాలు లేకపోలేదు.

Ishan Kishan: పల్లెకల్లె వేదికగా భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెప్టెంబర్ 2, అలాగే సెప్టెంబర్ 4న జరిగే మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ ఆడే ఛాన్స్ లేకపోవడంతో.. ప్లేయింగ్ 11లో అతడి స్థానంలోకి ఇషాన్ కిషన్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇషాన్ ఏ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడన్నది ఇప్పుడున్న ప్రశ్న. వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. వన్డే సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి దుమ్ముదులిపాడు.
కానీ వన్డేల్లో భారత్ తరపున రాహుల్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ను మిడిలార్డర్‌లో ఆడించడం.. టీమ్ మేనేజ్‌మెంట్‌కు కత్తి మీద సామే. టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడీ చూస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతారు. ఒకవేళ ఇషాన్ జట్టులోకి వస్తే గిల్ లేదా రోహిత్ దిగువన ఆడక తప్పదని చర్చ సాగుతోంది. అలా కాకపోతే గిల్ నంబర్ 3లో, కోహ్లీ నంబర్ 4లో ఆడే అవకాశాలు లేకపోలేదు. కానీ జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్‌ను నంబర్ 4 లేదా నంబర్ 5లో ఆడించాలని చూస్తోందట. అటు రోహిత్, ఇటు ద్రవిడ్ టాప్ 3 బ్యాటింగ్ లైనప్‌ను తారుమారు చేయకూడదని భావిస్తున్నారట. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఎన్నో ప్రయోగాలు చేయడంతో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
అటువంటి పరిస్థితిలో, ప్రపంచకప్‌కు దగ్గర పడుతున్న వేళ.. ఓపెనర్‌ను 4 లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఆడించాలన్న నిర్ణయం టీమిండియాకు సరైనదేనా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒకవేళ స్పిన్ పిచ్ అంటే తడబాటుకు గురయ్యే ఈ లెఫ్ట్ హ్యాండ్ హార్డ్ హిట్టర్, నంబర్ 4 కి సరిపోతాడా లేదా అనేది ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్‌లో టాపిక్‌గా మారింది.