Virat Kohili: విరాట్ భయ్యా టిప్.. హాఫ్ సెంచురీతో హైప్

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ యువ వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 24, 2023 | 04:06 PMLast Updated on: Jul 24, 2023 | 4:06 PM

Ishan Kishan Who Replaced Virat Kohli Scored A Half Century Against West Indies In Test Cricket

ఇషాన్‌కు ఇదే మొదటి టెస్టు హాఫ్ సెంచరీ కావడం విశేషం. విండీస్‌తో జరిగిన మొదటి టెస్టులోనే టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగు పెట్టిన ఇషాన్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయడంతో ఎక్కువ రన్స్ చేసే అవకాశం అతడికి రాలేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన ఇషాన్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెగ్యులర్‌గా ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్.. దూకుడుగా ఆడి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.

కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో ఒంటిచేత్తో సిక్స్‌ కొట్టి మరీ 50 మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వెళ్లమని కోహ్లీనే తనకు స్వయంగా చెప్పాడని ఇషాన్ తెలిపాడు. కోహ్లీ నిర్ణయంతోనే ఈ హాఫ్ సెంచరీ సాధ్యమైందని పేర్కొన్నాడు. 4 రోజు ఆట అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్‌ స్పందిచాడు. విరాట్ కోహ్లీ స్వయంగా న వద్దకు వచ్చి బ్యాటింగ్‌కు వెళ్లమని చెప్పాడు. వర్షం తర్వాత 70 -80 పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేద్దామని ముందే అనుకున్నాం. విండీస్‌ ముందు 370-380 పరుగుల లక్ష్యం ఉంచాలనుకున్నాం. అందుకే దూకుడుగా ఆడేశాం’ అని అన్నాడు.