Virat Kohili: కోహ్లీ ఊరికే కింగ్ స్థాయికి వెళ్ళలేదు వాడికి క్రికెట్ తప్ప ఇంకేం తెలీదు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లో ఎన్నో ఒడదుడుకలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కోహ్లికి తన వ్యక్తిగత జీవితం కంటే ఆటకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు.
తన కెరీర్ ఆరంభరోజుల్లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదహరణగా నిలుస్తుంది. 2006 డిసెంబర్ 18 కోహ్లికి తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. ఆ రోజు ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో తన తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విన్న కోహ్లి బాధను దిగమింగుకొని 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలోఆన్ గండం నుండి గట్టెక్కించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఇది ఒక్కటి చాలు కోహ్లికి ఆటపై ఉన్న నిబద్దత ఎంటో తెలపడానికి. ఇక కోహ్లి జీవితంలో చోటు చోసుకున్న ఈ విషాద సంఘటనను టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ మరోసారి గుర్తుచేశాడు. తన తండ్రి మరణ వార్త విన్న కోహ్లి ఒంటరిగా ఓవైపుకు వెళ్లి చాలా బాధపడ్డాడని ఇషాంత్ తెలిపాడు. కాగా వీరిద్దరూ కలిసి దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడారు.
ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్ శర్మ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లి తన తండ్రి మరణించిన రోజు ఒంటరిగా చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ కోహ్లి తన బాధను దిగమింగుకుని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ అటువంటి కష్టసమయంలో అంత దుఃఖన్ని తట్టుకుని ఎలా ఆడాడో ఇప్పటివరకు నాకు అర్ధం కాలేదు. సమయంలో అతడికి కేవలం 17 ఏళ్ల వయస్సు మాత్రమే. అదే నాకు అలా జరిగి ఉంటే తట్టుకోలేకపోయేవాడిని అని అతడు చెప్పుకొచ్చాడు.