ఇది కదా ఫాలోయింగ్ అంటే పాక్ గడ్డపై ఓ రేంజ్ లో కోహ్లీ క్రేజ్
అభిమానానికి హద్దులు ఉండవు... దేశాల మధ్య వైరం ఉన్నా క్రికెటర్లను ఆరాధించే విషయంలో మాత్రం అన్నింటినీ పక్కన పెట్టేస్తారు... క్రీడలను క్రీడల్లాగే చూస్తుంటారు.. ఈ క్రమంలో పాకిస్తాన్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ చూస్తే ఎవ్వరికైనా సరి దిమ్మతిరగాల్సిందే..

అభిమానానికి హద్దులు ఉండవు… దేశాల మధ్య వైరం ఉన్నా క్రికెటర్లను ఆరాధించే విషయంలో మాత్రం అన్నింటినీ పక్కన పెట్టేస్తారు… క్రీడలను క్రీడల్లాగే చూస్తుంటారు.. ఈ క్రమంలో పాకిస్తాన్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ చూస్తే ఎవ్వరికైనా సరి దిమ్మతిరగాల్సిందే.. కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగా మరోసారి వెలుగులోకి వచ్చింది. పాక్ క్రికెటర్లను అభిమానిస్తున్నారో లేదో తెలీదు కానీ భారత స్టార్ క్రికెటర్ కోసం పాక్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. తమ సొంత దేశానికి మద్ధతు కూడా పలకుండా ఇప్పుడు కోహ్లీ జపం చేస్తున్నారు. పైగా తమ దేశంపైనే సెంచరీతో దుమ్మురేపిన కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారు. గత వారం ఛాంపియన్స్ ట్రోఫీకే హైవోల్టేజ్ గా మ్యాచ్ నిలిచిన భారత్, పాక్ పోరులో ఎక్కువ మంది అభిమానులు కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకే ఆసక్తి చూపించారు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. దాయాధుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీని చూసిన పాకిస్తాన్ అభిమానులు సంతోషపడ్డారు. ఈ టోర్నీలో వారి జట్టు ఓటమిపాలైనప్పటికీ.. కోహ్లీ సెంచరీ చేయడంతో ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ అభిమానులు చప్పట్లు కొడుతూ ఆనందించారు.
విరాట్ కోహ్లీ తన 51 వన్డే సెంచరీతో పాకిస్తాన్ క్రీడాభిమానుల మనసు కూడా దోచుకున్నాడు. తన సెంచరీతో పాకిస్తాన్ పై ఆరు వికెట్ల తేడాతో భారత్ కి విజయాన్ని అందించాడు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్లలో కానీ, ఇటు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లలో కానీ.. ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ జెర్సీ లతోనే క్రీడాభిమానులు దర్శనమిస్తున్నారు. వీరిలో భారత క్రీడాభిమానుల కంటే పాకిస్థాన్ క్రీడాభిమానిలే ఎక్కువగా విరాట్ జెర్సీతో కనిపిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళ.. కింగ్ కోహ్లీ పేరున్న జెర్సీతో సందడి చేసింది. ఇక పాకిస్తాన్ జెర్సీపై విరాట్ 18 అనే నెంబర్ కనిపిస్తోంది. ఇలా విరాట్ కోహ్లీ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు పాకిస్తాన్ క్రీడాభిమానులు. ఇలా వైరల్ గా మారిన వీడియోలు, ఫోటోలను చూసిన భారత క్రీడాభిమానులు ఇదేం క్రేజ్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కోహ్లీ ఆటకు క్రికెట్ ప్రపంచం ఎప్పుడో ఫిదా అయిపోగా.. పాక్ లో కూడా అతని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఉన్నారని తేలిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మీడియా మొత్తం విరాట్ కోహ్లీకి కేజిఎఫ్ లెవెల్ లో ఎలివేషన్స్ ఇచ్చింది. పాకిస్తాన్ ని మరోసారి విరాట్ కోహ్లీ ఓడించాడని, కింగ్ కోహ్లీ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అంటూ.. భారత మీడియాను మించి పాకిస్తాన్ మీడియా విరాట్ కోహ్లీని పొగిడింది. ఇక టోర్నీలో టీమిండియానే విజేతగా నిలవాలంటూ పాక్ అభిమానులు కోరుకుంటున్నారు.