IPL 2024 : టాప్ 4 టీమ్స్ ఏవో చెప్పడం కష్టమే.. రోజూ మారిపోతున్న లెక్కలు
ఐపీఎల్ 2024 (IPL 2024) పాయింట్స్ టేబుల్ టాప్ ఫోర్ ఇప్పుడు మ్యూజికల్ చైర్ లా మారింది. లీగ్ దశ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓడించిన తర్వాత పాయింట్ల పట్టిక మారడంతోపాటు ప్లేఆఫ్స్ రేసు కూడా మరింత రసవత్తరంగా మారింది.
ఐపీఎల్ 2024 (IPL 2024) పాయింట్స్ టేబుల్ టాప్ ఫోర్ ఇప్పుడు మ్యూజికల్ చైర్ లా మారింది. లీగ్ దశ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓడించిన తర్వాత పాయింట్ల పట్టిక మారడంతోపాటు ప్లేఆఫ్స్ రేసు కూడా మరింత రసవత్తరంగా మారింది. ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ ను బెర్తును ఖాయం చేసుకుంటుంది అనుకున్న తరుణంలో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ టీమ్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. మొదట 9 మ్యాచ్ లలో 8 గెలిచిన రాయల్స్.. తర్వాత వరుసగా రెండు ఓడి ప్రస్తుతం 11 మ్యాచ్ లలో 8 విజయాలు, మూడు ఓటములతో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది.
రాజస్థాన్ (Rajasthan) పై విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా ఐదో స్థానానికి రావడంతో ప్లేఆఫ్స్ బెర్తుకు చేరువైంది. ప్రస్తుతం ఆ టీమ్ 12 మ్యాచ్ లు ఆడేసింది. ఆరు విజయాలు, ఆరు ఓటములతో క్యాపిటల్స్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ ఆరో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ ఖాతాలోనూ 12 పాయింట్లే ఉన్నా నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. ఇదిలా ఉంటే టాప్ 4లో ఎవరు ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవుతారన్నది చెప్పడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ లో ఉండగా… తర్వాత రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈ సీజన్లో మొదటి నుంచీ ఈ నాలుగు జట్లూ టాప్ 4లో ఉంటూ వస్తున్నా.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ లాంటి టీమ్స్ తో వీటికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.