ధోనీ ఆ 3 రికార్డులు వేరే లెవెల్ బ్రేక్ చేయడం అసాధ్యం
క్రికెట్ లో చాలా రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉంటాయి... ఐపీఎల్ లాంటి మెగాలీగ్ లోనూ రికార్డుల మోత మోగుతూనే ఉంటుంది.. సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ మెరుపులతో సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి..

క్రికెట్ లో చాలా రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలవుతూనే ఉంటాయి… ఐపీఎల్ లాంటి మెగాలీగ్ లోనూ రికార్డుల మోత మోగుతూనే ఉంటుంది.. సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ మెరుపులతో సరికొత్త రికార్డులు నమోదవుతుంటాయి.. కానీ ఐపీఎల్ లో నమోదైన కొన్ని రికార్డులు మాత్రం బద్దలయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సాధించిన 3 రికార్డులు లీగ్ చరిత్రలో అన్ బ్రేకబుల్ గానే ఉంటాయి. ఐపీఎల్‌లో అత్యధికంగా 226 మ్యాచ్‌లకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు. ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ధోని తర్వాత ఐపీఎల్ లో అత్యధికంగా రోహిత్ శర్మ 158 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ గా తప్పుకున్నాడు.
అలాగే కెప్టెన్ గా అతిపెద్ద వయసులో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్ గా కూడా ధోని ఉన్నాడు. 42 ఏళ్ల 325 రోజుల వయసులో 2023 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను చాంపియన్ గా నిలిపాడు.ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సెంచరీ విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్ గా ఉన్నాడు. అతను 226 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 133 మ్యాచ్ ల్లో సీఎస్కే గెలిచింది. మరో 91 మ్యాచ్‌లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. ఈ మూడు రికార్డులను మరో ఆటగాడు బ్రేక్ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగావేలానికి ముందు చెన్నై ఫ్రాంచైజీ ధోనీని 4 కోట్లతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఐదేళ్ళు దాటిన ఏ ప్లేయర్ అయినా అన్ క్యాప్డ్ కేటగిరీ కిందకే వస్తాడు. దీని ప్రకారం ధోనీకి 4 కోట్లకు మించి చెల్లించేందుకు వీలులేదు. కాగా కొత్త సీజన్ కోసం ఇప్పటికే మిస్టర్ కూల్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాడు. ధోని ప్రాక్టీస్ చేయడమే కాదు యువ ఆటగాళ్ళకు కోచింగ్ కూడా చేస్తూ కనిపించాడు. అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ విలువైన సూచనలు ఇస్తూ యంగస్టర్స్ ను ప్రోత్సహిస్తున్నాడు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ముంబై ఇండియన్స్ తో తలపడబోతోంది. ఇక గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగుతాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్‌తో కలిపి మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 74 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి 11 మ్యాచులు జరగనున్నాయి.