Sarfaraz Khan: ఆ ఒక్కటే మిగిలి ఉంది
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి.. టీమిండియాలో చోటు దక్కుంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు.

It is known that Sarparaj Khan, who was not selected for the West Indies tour in the Indian cricket team, is ready for marriage
రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో విరుచుకుపడుతున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్ జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాకు చెందిన యువతిని వివాహమాడాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రంజీల్లో ముంబైకి, ఐపీఎల్ లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ఫిట్‌నెస్ లోపం వల్లే భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటన కోసం టెస్టు జట్టులో సర్ఫరాజ్‌ను ఎంపిక చేస్తారని అందరూ భావించినా.. సెలెక్టర్లు మాత్రం అతడికి మొండి చేయి చూపారు.
ఇక సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోల్లో సర్ఫరాజ్ సంప్రదాయబద్ధమైన నలుపు రంగు షేర్వాణీలో తళుక్కుమనగా.. వధువు ఎర్ర రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది. అయితే పెళ్లి కూతురుకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. ఓ వీడియాలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని సర్ఫరాజ్ అన్న మాటలు వైరల్‌గా మారాయి. ‘కశ్మీర్‌లో పెళ్లి జరగాలని ముందే రాసిపెట్టి ఉన్నట్లుంది’ అని సర్ఫరాజ్ అన్నట్లు అందులో వినిపించింది. విధి సహకరిస్తే.. ఏదో ఒకరోజు భారత జట్టుకు తప్పక ఆడుతా అని కూడా సర్ఫరాజ్ పేర్కొన్నాడు.