T20 Afghanistan : అఫ్గాన్‌ అద్భుత విజయం వెనక ఉంది మనోళ్లే..

2024 టీ20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ టీం నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి. క్రికెట్‌ ప్రపంచంలో పసికూనగా భావించే ఈ టీం.. మొదటి సారి ఐసీసీ టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2024 | 12:03 PMLast Updated on: Jun 27, 2024 | 12:03 PM

It Must Be Said That The Afghanistan Team Is Really A Sensation In The 2024 T20 World Cup

2024 టీ20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ టీం నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి. క్రికెట్‌ ప్రపంచంలో పసికూనగా భావించే ఈ టీం.. మొదటి సారి ఐసీసీ టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరింది. అది కూడా న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా లాంటి టీంలను ఓడించి ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌లో పూర్తి స్థాయి మెంబర్‌గా మారిన ఏడేళ్లలోనే ఈ స్థాయికి చేరి.. ఓ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. నిజానికి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌లో పర్మినెంట్‌ మెంబర్‌గా స్థానం సంపాదించడమే అఫ్గానిస్తాన్‌ టీంకు మొదటి విజయం. ఎందుకంటే ఆ దేశం తాలిబాన్ల కంట్రోల్‌లో ఉంది. వాళ్లకు క్రికెట్‌ పెద్దగా నచ్చదు. సపోర్ట్‌ కూడా చేయరు. వాళ్ల వే ఆఫ్‌ రూలింగ్‌ ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటి తాలిబాన్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ టీం ఈ స్థాయికి రావడం నిజంగా ఒప్పుకోదగ్గ విషయం. అయితే ఈ టీం ఇక్కడి కాదా రావడం వెనక ఇండియా పాత్ర చాలా కీలకంగా ఉంది. యస్‌.. అండర్‌డాగ్స్‌గా ఉన్న అఫ్గనిస్తాన్‌ జట్టు ఈ స్థాయికి ఎదగడం వెనుక.. బీసీసీఐ చాలా కీ రోల్‌ ప్లే చేసింది.

అఫ్గానిస్తాన్‌లోని ఆర్థిక పరిస్థితులు, సదుపాయాల కొరత కారణంగా ఆ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌లకు ఆతిథ్యం కల్పించే అవకాశం లేకుండా పోయింది. అలాంటి సమయంలో బీసీసీఐ అఫ్గాన్‌ బోర్డుకు పెద్దన్నగా ఆపన్నహస్తం అందించింది. గ్రేటర్‌ నోయిడాలో ఉన్న షాహీద్‌ విజయ్‌ సింగ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను తమ హోం గ్రౌండ్‌గా వాడుకునేందుకు 2015లో బీసీసీఐ అనుమతినిచ్చింది. అఫ్గాన్‌ క్రికెట్‌ టీం తలరాతను మార్చిన నిర్ణయం ఇది. ఇండియా ఇచ్చిన ఈ పుషప్‌తో.. 2017లో అఫ్గనిస్తాన్‌ గ్రేటర్‌ నోయిడా వేదికగా ఐర్లాండ్‌తో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ పాల్గొంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తమ మకాంను షార్జాకు మార్చిన అఫ్గన్‌ జట్టు.. మళ్లీ ఉత్తరప్రదేశ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ ఆడేందుకు సిద్దమైంది. ఇలా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టును బీసీసీఐ ఆదుకుంది. అంతర్జాతీయ వేదిక కల్పించి వారిని ప్రోత్సహించింది.

ఇక అఫ్గాన్‌ టీంకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పింది కూడా ఇండియన్‌ మాజీ క్రికెటర్లే. అఫ్గాన్‌ టీంను మరింత బలంగా మార్చేందుకు లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, మనోజ్‌ ప్రభాకర్‌, అజయ్‌ జడేజా ఈ జట్టుకు కోచ్‌లుగా ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్‌-2023 సమయంలో అజయ్‌ జడేజా అఫ్గాన్‌కు మెంటార్‌గా ఉండి ముందుకు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో ప్రపంచం అంచనాలకు మించి అఫ్గాన్‌ టీం చెలరేగిపోయింది. అంతేకాదు మొట్టమొదటిసారి పాకిస్తాన్‌పై వన్డేలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత్‌- అఫ్గనిస్తాన్‌ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దేశ పార్లమెంట్‌ భవనం నిర్మాణం విషయంలోనూ భారత్‌ ఆర్థిక సహాయం చేసింది.

ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ గతంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీని ఇండియాకు ఆహ్వానించింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో అఫ్గాన్‌ తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న వేళ.. మ్యాచ్‌ వీక్షించేందుకు స్వాగతం పలికింది. ఇరు దేశాల అనుబంధం, క్రికెట్‌ జట్ల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇండియా ఇచ్చిన ఈ సహాయం అఫ్గానిస్తాన్‌ గుర్తుంచుకుంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే.. ఇవాళ ఆ టీం ఈ స్థాయిలో ఉండటం వెనక భారత్‌ పాత్ర చాలా కీలకం.