IPL 2024 : వేలం తర్వాత చెన్నై ప్రెస్ మీట్..
ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఎంఎస్ ధోని నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, ధోనీ నాయకత్వ పగ్గాలను వేరే ఆటగాడికి అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఐపీఎల్ వేలం అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా ధోనీ కెప్టెన్సీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని.. అయితే, ‘కెప్టెన్ కూల్’ మాత్రం ప్రతి ఏడాది అత్యుత్తమంగా జట్టును నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు.

It seems that MS Dhoni will lead the Chennai Super Kings in the IPL 2024 season.
ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఎంఎస్ ధోని నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, ధోనీ నాయకత్వ పగ్గాలను వేరే ఆటగాడికి అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఐపీఎల్ వేలం అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా ధోనీ కెప్టెన్సీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని.. అయితే, ‘కెప్టెన్ కూల్’ మాత్రం ప్రతి ఏడాది అత్యుత్తమంగా జట్టును నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు. ఎంఎస్ ధోనీ తర్వాత నాయకత్వ బాధ్యతలను చేపట్టే వారి కోసం గత పదేళ్లుగా మేం అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది చర్చగా మారుతోంది. కానీ, ధోనీని గత కొంతకాలంగా చూస్తున్నా.. అతడిలో ఉత్సాహం, ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేం అలాగే కొనసాగుతాం’’ అని ఫ్లెమింగ్ తెలిపాడు. బెన్‌స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయడానికే డారిల్ మిచెల్‌ను కొనుగోలు చేయలేదని ఫ్లెమింగ్ స్పష్టం చేసాడు. డారిల్ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రదర్శన అద్భుతం. తీవ్ర ఒత్తిడిలోనూ రాణించగల నేర్పరి. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడు. బౌలర్‌గానూ ఉపయోగపడతాడు. చెపాక్‌లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుంది’’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.