జడ్డూ భాయ్ నయా హిస్టరీ టెస్టుల్లో 300 వికెట్లు
కాన్పూర్ టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షంతో మూడు రోజుల ఆట జరగకున్నా నాలుగోరోజు టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాదేశ్ ను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు.
కాన్పూర్ టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షంతో మూడు రోజుల ఆట జరగకున్నా నాలుగోరోజు టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాదేశ్ ను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. బంగ్లా ఇన్నింగ్స్ లో చివరి బ్యాటర్ ఖలీద్ అహ్మద్ ను ఔట్ చేయడం ద్వారా తన టెస్టు కెరీర్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో 3000 పరుగులతో పాటు 300 వికెట్లను వేగంగా సాధించిన ఆసియా క్రికెటర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. 73 టెస్టులు ఆడిన జడేజా 300 వికెట్లతో పాటు 3122 పరుగులు సాధించాడు. అలాగే వేగంగా 300 వికెట్లను రెండో భారత బౌలర్‌గానూ ఘనత సాధించాడు.
జడేజా 17428 బంతుల్లోఈ ఘనత అందుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ 15636 బంతుల్లో 300 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇదిలా ఉంటే టెస్టుల్లో ఓవరాల్‌గా 3000 ప్లస్ రన్స్ , 300 వికెట్లు సాధించిన 11వ ప్లేయర్‌గా, మూడో భారత క్రికెటర్‌గా జడేజా రికార్డు సాధించాడు. జడేజా కంటే ముందు భారత్ నుంచి అశ్విన్, కపిల్ దేవ్ ఈ రికార్డు అందుకున్నారు. అశ్విన్ 3422 పరుగులు, 524 వికెట్లు… కపిల్ దేవ్ 5248 పరుగులు, 434 వికెట్లు తీశారు. ఇక 300 వికెట్ల మార్క్‌ను అందుకున్న ఏడో భారత బౌలర్ గానూ జడేజా నిలిచాడు.