జడేజా @ 600 వికెట్లు, ఆల్ రౌండర్ ఆల్ టైమ్ రికార్డ్
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో రికార్డుల మోత మోగించాడు. ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో రికార్డుల మోత మోగించాడు. ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో రవీంద్ర జడేజా 600 వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. టెస్టుల్లో 323, వన్డేల్లో 223, టీ20ల్లో 54 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో అనిల్‌కుంబ్లే 953 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత అశ్విన్, హర్భజన్, కపిల్ దేవ్‌లు ఉన్నారు. భారత్ తరుపున 600 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ జడేజానే. అంతర్జాతీయ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే 401 మ్యాచుల్లో 953 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 287 మ్యాచుల్లో 765 వికెట్లు, హర్భజన్ సింగ్ 365 మ్యాచుల్లో 707 వికెట్లు, కపిల్ దేవ్ 356 మ్యాచుల్లో 687 వికెట్లు భారత్ తరుపున అత్యధిక వికెట్లు పడగొట్టారు. నాగ్ పూర్ వన్డేలో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన జడ్డూ 1 మెయిడిన్ ఓవర్ వేసి.. కేవలం 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు జేమ్స్ అండర్సన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇరు దేశాల మధ్య జరిగిన వన్డేల్లో అండర్సన్ 40 వికెట్లు తీయగా.. తాజా మ్యాచ్‌లో మూడు వికెట్లు కలిపి జడేజా 42 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో అండ్రూ ఫింట్లాఫ్, హర్భజన్ సింగ్‌లు ఉన్నారు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన అతడు.. జాకోబ్ బెథెల్ వికెట్ పడగొట్టడంతో అత్యధిక వికెట్ల మార్క్ ను టచ్ చేశాడు. అలాగే జడేజా మరో రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీయడంతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా రికార్డులకు ఎక్కాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యదిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ సిన్నర్ల జాబితాలో జడేజా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య 323 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత షకీబుల్ హసన్ ,డానియల్ వెటోరీ ఉన్నారు.