T20 Jai Shah : కప్ మనదే అని ఎప్పుడో చెప్పిన జై షా.. అట్లుంటది ఇండియాతోని…
17ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అఖండ భారతావని ఊపిరి బిగపట్టుకొని ఎదురుచూసిన క్షణం.. రోహిత్ సేన వాల్డ్‌కప్‌ను ముద్దాడింది.

Jai Shah who once said that the cup is ours.. such is with India...
17ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అఖండ భారతావని ఊపిరి బిగపట్టుకొని ఎదురుచూసిన క్షణం.. రోహిత్ సేన వాల్డ్‌కప్‌ను ముద్దాడింది. లాస్ట్ ఓవర్.. లాస్ట్ బాల్.. భారత్ గెలుపు ఖాయం అయిన క్షణం.. ప్రతీ ఒక్కరికి గూస్‌బంప్స్. ఆనందాలు, ఆనంద భాష్పాలు, ఎమోషనల్ పలకరింపులు చాలానే కనిపించాయ్ గ్రౌండ్‌లో! 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన భారత్.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండుసార్లు టీ20వాల్డ్ కప్ అందుకున్న జట్టుగా నిలిచింది.
ఐతే ఈసాల కప్ నమ్‌దే అనే లెవల్‌లో.. బార్బడోస్‌లో కప్ కొట్టి తీరుతాం అని బీసీసీఐ కార్యదర్శి జై షా ముందే చెప్పారు. అప్పుడు చెప్పారు.. ఇప్పుడు కొట్టారు.. అట్లుంటది ఇండియాతోని అంటూ ఇప్పుడు కామెంట్లు వినిపిస్తున్నాయ్. 2023 వన్డే వాల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. ఆ టైమ్‌లోనే జై షా ఈ ప్రకటన చేశారు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓడిపోయినా.. టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురైన జైషా… అప్పట్లోనే ఈ ప్రకటన చేశారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు.
తాను ప్రపంచకప్ ఓటమిపై ఇప్పుడు ప్రకటన ఇస్తున్నానని… 2023లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత కూడా టీమిండియా ట్రోఫీని ఎత్తలేకపోవచ్చని… ఇప్పుడు తాము హృదయాలను గెలిచామని 2023 ఫైనల్లో ఓటమి తర్వాత జై షా అన్నాడు. ఈ ఓటమితో ఆగిపోమని… 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్‌లో కచ్చితంగా భారత జెండా పాతుతామని అప్పుడే జై షా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మాటలు నిజం అయ్యాయ్. దీంతో జైషా పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నపాటి నోస్ట్రడామస్ అయిపోయావ్ జైషా అంటూ కొందరు.. కామెంట్లు పెడుతున్నారు.