ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్-5 లోకి జైశ్వాల్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరోసారి భారత యువ క్రికెటర్లు దుమ్మురేపారు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యశస్వి జైస్వాల్ టాప్ 5లోకి దూసుకొచ్చాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరోసారి భారత యువ క్రికెటర్లు దుమ్మురేపారు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యశస్వి జైస్వాల్ టాప్ 5లోకి దూసుకొచ్చాడు. ఈ మ్యాచ్ జైశ్వాల్ హాఫ్ సెంచరీ చేయడంతో ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని ఐదో స్థానంలో నిలిచాడు. తద్వారా భారత్ తరఫున టాప్ ర్యాంక్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శతకంతో అదరగొట్టిన రిషభ్ పంత్ తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. శుభ్‌మన్ గిల్ 5 స్థానాలు మెరుగు పరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డారిల్ మిచెల్ రెండో స్థానంలో నిలిచాడు.
మరోవైపు తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఐదేసి స్థానాలు దిగజారారు. రోహిత్ 10వ స్థానంలో నిలవగా.. కోహ్లీ 12వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. అటు ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. చెన్నై టెస్టులో సెంచరీ చేయడంతో పాటు 6 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.