టెస్టుల్లో జైశ్వాల్ జోరు ఓపెనర్ అరుదైన రికార్డ్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో సొంతగడ్డపై 1000 ప్లస్ టెస్ట్ రన్స్ చేసిన మూడో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో సొంతగడ్డపై 1000 ప్లస్ టెస్ట్ రన్స్ చేసిన మూడో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు.
యశస్వి జైస్వాల్ కంటే ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో సొంతగడ్డపై 1000 ప్లస్ రన్స్ చేశారు. 1979లో గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్ మాత్రమే సొంతగడ్డపై 1000 ప్లస్ రన్స్ చేశారు. తాజాగా యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో చేరాడు.దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ గ్రాహమ్ గూచ్, ఆసీస్ బ్యాటర్ జస్టిన్ లాంగర్, పాక్ బ్యాటర్ మహమ్మద్ యూసఫ్ మాత్రమే సొంతగడ్డపై ఈ ఫీట్ సాధించారు.